1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 12 నవంబరు 2022 (11:10 IST)

ఎన్టీఆర్ కు న్యూ డే మొదలైంది

NTR-new day post
NTR-new day post
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనకు ఈరోజు "కొత్త రోజు, కొత్త వైబ్రేషన్,. మరియు మేథావి తనం పెంచే రోజు.. అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేసాడు. ఇలా దెనిగురించి అని చెప్పకుండా పజిల్ గా వదిలేసాడు. ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివతో తన 30వ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ ఇరువురి కలయికలో ఈ చిత్రం రెండోది కావడం పైగా ఎన్టీఆర్ కి ఈ చిత్రం RRR లాంటి భారీ హిట్ కావడంతో పాన్ ఇండియా వైడ్ సెన్సేషనల్ అంచనాలు అయితే నెలకొన్నాయి. ఇక ఈ భారీ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే గోవా కూడా చిత్ర యూనిట్ వెళ్ళింది. త్యరలో షూట్ ప్రారంభం కానున్నది. 
 
కాగా, లేటెస్ట్ గా ఎన్టీఆర్ కొత్త మేకోవర్ పోస్ట్ చేయడంతో అది సినిమాకు సంబదించింది కాదు అని తెలుస్తున్నది. తాజాగా ఎన్టీఆర్ ఓ యాడ్ చేస్తున్నట్లు  తెలుస్తున్నది. అందుకే కొత్త రోజు, కొత్త ప్రకంపనలు... మరియు ఆలిం అని పోస్ట్ చేసాడు. అలీమ్ అంటే సాంప్రదాయం ప్రకారం, తన చదువును పూర్తి చేసిన ఒక విద్యార్థి తన గురువుచే స్వీకరించబడే గౌరవం. బహుశా దానికి చెందిన యాడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ వెనుక కమర్షియల్ యాడ్ మేకర్ ఉండడంతో ధృవీకరించబడింది.