శనివారం, 9 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 నవంబరు 2022 (09:48 IST)

జిమ్‌లో వర్కౌట్ చేస్తూ టీవీ నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ మృతి

Siddhaanth Vir Surryavanshi
Siddhaanth Vir Surryavanshi
జిమ్‌లో వర్కౌట్ చేస్తూ ముంబైకి చెందిన ప్రముఖ టీవీ నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ ప్రాణాలు కోల్పోయాడు. కుసమ్, కసౌటీ జిందగీ కే, జిద్దీ దిల్ మానేనా వంటి పలు షోలతో అలరించిన సూర్యవంశీ శుక్రవారం జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిపోయాడు. 
 
వెంటనే ఆయనను కోకిలాబెన్ ధీరూభాయి అంబానీ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆయన మరణించినట్లు ఆయనను పరీక్షించిన వైద్యులు నిర్ధారించారు. 
 
వ్యాయామం చేస్తుండగా గుండెపోటు రావడంతోనే ఆయన మరణించి ఉండొచ్చునని వైద్యులు చెప్తున్నారు. కాగా, జిమ్‌లో వ్యాయామం చేస్తూ మృత్యువాత పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే పలువురు సినీ స్టార్లు జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.