శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 నవంబరు 2022 (14:50 IST)

వరుణ్ ధావన్‌కు ఆ వ్యాధి.. కన్నీళ్లు పెట్టుకుంటూ..

Varun Dhawan, Kriti Sanon
తెలుగు స్టార్ నటి సమంత మయోసిటీస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలియగానే ఆడియన్స్ షాక్‌కు గురయ్యారు. తాజాగా మరో బాలీవుడ్ నటుడు ఓ భయంకర వ్యాధితో బాధపడుతున్న ప్రకటించడం అందరినీ కలిచివేసింది. 
 
బీ టౌన్ స్టార్ నటుడు వరుణ్ ధావన్ 'వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్' అనే వ్యాధికి గురైనట్లు కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పాడు. ఆయన కృతి హాసన్‌తో కలిసి నటించిన లేటేస్ట్ మూవీ 'భేదియా'. 
 
దీనిని తెలుగులో 'తోడేలు' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన వరుణ్ ధావన్ తనకున్న వ్యాధి గురించి చెప్పారు. వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ వ్యాధి చాలా అరుదైంది. డైరెక్టర్ డేవిడ్ ధావన్ కుమారుడు వరుణ్ ధావన్ కావడం గమనార్హం.