సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 31 అక్టోబరు 2022 (16:33 IST)

సరోజినీ నాయుడు బయోపిక్ చేయ‌బోతున్నాః బనారస్ హీరోయిన్ సోనాల్ మోంటెరో

Sonal Montero i
Sonal Montero i
కన్నడ ఎనిమిది సినిమాలు చేశాను. మిగతా చోట్ల నేను కొత్తే. హిందీ, తెలుగు పరిశ్రమల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులకు నచ్చాయి. ప్రేక్షకులు ఇచ్చిన ప్రేమ మా నమ్మకాన్ని పెంచింది- అని బనారస్ హీరోయిన్ సోనాల్ మోంటెరో తెలియ‌జేసింది.  జైద్ ఖాన్ హీరోగా బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా సినిమా ఇది. నవంబర్ 4న సినిమా విడుద‌ల కాబోతుంది. ఈ సంద‌ర్భంగా ఆమె ప‌లు విష‌యాలు తెలియ‌జేసింది. 
 
'బనారస్'  విడుదలకు ఇంకా నాలుగు రోజులే వుంది,, ఎలా అనిపిస్తుంది ?
ఎక్సయిట్ మెంట్, నేర్వస్నెస్.. రెండూ వున్నాయి. ఇది నా మొదటి పాన్ ఇండియా మూవీ. అన్ని పరిశ్రమలకు ఈ సినిమాతో పరిచయం కావడం ఎక్సయిటింగ్ గా అదే సమయంలో నెర్వస్ గా కూడా వుంది. ప్రేక్షకులు తప్పకుండా బనారస్ చిత్రాన్ని ఇష్టపడతారనే నమ్మకం వుంది.
 
ట్రైలర్ లో టైం ట్రావెల్, ప్రేమ కథ కనిపించాయి.. ఇంతకీ బనారస్ జోనర్ ఏమిటి ?
టైం ట్రావెల్ కథలో చిన్న భాగం మాత్రమే. లవ్ స్టొరీ, థ్రిల్, సస్పెన్స్, సైన్స్ ఫిక్షన్ ఇలా అన్ని వైవిధ్యమైన ఎలిమెంట్స్ వున్న చిత్రమిది. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ లా వుంటుంది. బనారస్ ని అద్భుతంగా చూపించాం. కంటెంట్ పరంగా చాలా స్ట్రాంగ్ గా వుంటుంది. అసాదారణమైన స్క్రిప్ట్ ఇది.  ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది.
 
బనారస్‌లో మీ పాత్ర ప్రాధన్యత ఎలా వుంటుంది ?
జయతీర్ధ గారి సినిమాల్లో హీరోయిన్స్ కి ఎక్కువ ప్రాధన్యత వుంటుంది. ఇందులో కూడా నా పాత్ర చాలా కీలకమైనది. ఇందులో ధని అనే పాత్రలో కనిపిస్తా. నా పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. హీరోకి ఎంత ప్రాధన్యత వుంటుందో  హీరోయిన్ కూడా అంతే ప్రాధాన్యత వున్న కథ ఇది.
 
కాంతార లాంటి విజయం తర్వాత కన్నడ నుండి వస్తున్న బనారస్.. ఎలా అనిపిస్తుంది ?
కాంతార విషయంలో నేను చాలా ఆనందంగా, గర్వంగా వున్నాను. మా ప్రాంతానికి చెందిన ఒక గొప్ప కథని చెప్పారు. అయితే బనారస్ పూర్తిగా భిన్నమైన సినిమా. రెండు జోనర్స్ వేరు. కాంతారని ఇష్టపడినట్లే బనారస్ ని కూడా ప్రేమిస్తారనే నమ్మకం వుంది.
 
మీకు హిందీలో కూడా అవకాశాలు వచ్చాయి కదా.. చేయకపోవడానికి కారణం ?
నా ద్రుష్టి సౌత్ పై వుంది. తులులో నా కెరీర్ ప్రారంభించాను. కన్నడ పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు నేనేవరో ఇక్కడవారికి తెలుసు. నాకంటూ ఒక పేరు వచ్చింది. వేరే పరిశ్రమలోకి డైరెక్ట్ గా  జంప్ చేసేయడం ఇష్టం వుండదు. అందులోనూ సౌత్ సినిమాలు బాలీవుడ్ కంటే అద్భుతంగా ఉంటున్నాయి. ప్రత్యేకంగా బాలీవుడ్ కి వెళ్లాల్సిన అవసరం ఏముంది. తెలుగులో రాబర్ట్ సినిమాలో ఒక క్యామియో చేశా. తెలుగు సినిమాలు చేయాలనే ఆసక్తి వుంది.
 
జైద్ ఖాన్ తో పని చేయడం ఎలా అనిపించింది ?
జైద్ పొలిటికల్ నేపధ్యం నుండి వచ్చారు. ఆయన ఎలా వుంటారోఅనిపించేది. అయితే జైద్ నా ఆలోచనలు తప్పని నిరూపించారు. జైద్ వండర్ ఫుల్ పర్శన్. మంచి ఫెర్ ఫార్మర్. చాలా సపోర్ట్ చేస్తారు. ట్రైలర్ చూస్తే చాలా అనుభవం వున్న నటుడిలానే కనిపిస్తారు తప్పితే కొత్త నటుడనే భావన రాదు.
 
కొత్తగా చేయబోతున్నా సినిమాలు ?
మూడు కన్నడ సినిమాలు చేస్తున్నా. అలాగే సరోజినీ నాయుడు బయోపిక్ చేస్తున్నా. ఇది పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది.