శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 నవంబరు 2022 (16:15 IST)

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పోసాని

posani krishnamurali
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి మండలి (ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ఛైర్మన్‌గా సినీ నటుడు పోసాని కృష్ణమురళి నియమితులయ్యారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. పైగా, ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డిపై ఈగ వాలనీయకుండా ఆయనను సమర్థించిన నేతల్లో పోసాని ఒకరు. 
 
ఇపుడు ఆయన సేవలకు మెచ్చి ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పోసాని నియామకానికి సంబంధించి గురువారం అధికారికంగా ఉత్తర్వులు జారీచేసింది. 
 
గత వారం హాస్య నటుడు అలీని రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహదారుడుగా నియమించిన విషయం తెల్సిందే. అలీకి పదవి వరించిన కొద్ది రోజుల్లోనే పోసానికి కూడా పదవి వరించడం గమనార్హం.