గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 అక్టోబరు 2022 (11:34 IST)

ఈ పదవి నా కుమార్తె పెళ్లి సీఎం జగన్ ఇచ్చిన బహుమతి : నటుడు అలీ

ALi_Jagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానికి మీడియా సలహాదారుడుగా తెలుగు సినీ హాస్య నటుడు అలీ నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ సాధారణ పరిపాలనా మంత్రిత్వ శాఖ (జీఏడీ) కార్యదర్శి ముత్యాల రాజు శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. 
 
దీనిపై హాస్య నటుడు అలీ స్పందిస్తూ, ఈ పదవి తన కుమార్తె పెళ్లికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన గిఫ్టుగా అని చెప్పారు. పైగా, తాను వైకాపాలో చేరినప్పటి నుంచి పార్టీ అభివృద్ధికి పాటుపడుతున్నానని చెప్పారు.
 
అయితే, పదవుల కోసం తాను ఏనాడు ఆశపడలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో పాటు పార్టీ అప్పగించిన పనులను నిబద్ధతతో పని చేస్తున్నానని తెలిపారు. 
 
అదేసమయంలో తనకు సీఎం జగన్ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా న్యాయం చేస్తూ, న్యాయం చేస్తామని తెలిపారు. ఈ పదవి తన కుమార్తె పెళ్లికి జగన్ ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నానని తెలిపారు.