బిగ్ బాస్ రద్దు చేయాలంటూ పిటిషన్.. హీరో నాగార్జునకు కోర్టు నోటీసు
ప్రముఖ టీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షోను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారణకు విచారణకు స్వీకరించిన కోర్టు... గురువారం మూడో విడతగా విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా ఈ రియాల్టీ షో హోస్ట్, హీరో అక్కినేని నాగార్జునతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేయాలని, మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ఈ బిగ్ బాస్ రియాల్టీ షోలో అశ్లీలత ఎక్కువగా ఉందని, ఫ్యామిలీతో కలిసి చూసే పరిస్థితి లేదని, అందువల్ల ఈ షోను రద్దు చేయాలని హైకోర్టులో దాఖలైన పిటిషనులో పేర్కొమ్నారు. దీనిపై ఇప్పటికే రెండు దఫాలుగా విచారణ జరిపిన హైకోర్టు... గురువారం మూడో దఫాగా విచారణ జరిపింది. ఈ విచారణలో ప్రతివాదులకు నోటీసులు జారీ అయ్యాయి. మూడు వారాల్లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలంటూ నాగార్జునతో పాటు కేంద్ర రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశించింది.