ఇలాంటి పబ్లిసిటీ లాభమా? నష్టమా?
తెలుగు సినిమారంగంలో విడుదలకు ముందు పబ్లిసిటీ చేయడం మామూలే. అది ఒక ప్రణాళిక ప్రకారం ఒకప్పుడు వుండేది. అప్పట్లో దినప్రతికలు, మీడియా సంస్థలు ఎక్కువ మోతాదులో లేవు. సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక సిబ్బంది ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్‌లు, ఆడియో ఫంక్షన్‌లు వుండేవి. ఇప్పుడు ఆడియో ఫంక్షన్ లేకుండా పోయింది. ఏకంగా దాని స్థానంలో ఒక్కో పాటను ఒక్కో సెలబ్రిటీ విడుదలచేస్తున్నారు. మారిన అంతర్జాలయంలో పబ్లిసిటీ సదరు నిర్మాణ సంస్థలు ఇవ్వడంతో వాటిని ఏరికోరి తీసుకుని ప్రచారం చేయడం జరుగుతుంది. ఒకరకంగా పెద్ద ఖర్చులేనిపని.
ఇక ఇప్పుడు సినిమా పబ్లిసిటీ చేయాలంటే చాలా తంతుగా మారిందనేది సినీ పెద్దల ఉవాచ. అప్పటికీ ఇప్పటికే కంపేర్ చేస్తే, కథల విషయంలో ఎంత క్లారిటీలేదో పబ్లిసిటీ విషయంలో అంతేగా వుందని టాక్ ప్రబలంగా వినిపిస్తోంది. రెండు మూడురోజుల ముందు చిత్ర యూనిట్‌తో సినిమా గురించి పరిచయం వ్యాఖ్యలు చేయించడం జరుగుతుంది. అది ప్రజలకు చేరేలోపలే సినిమా విడులకావడం జరిగిపోతుంది. హీరోల ఇంటర్వయూలయితే మరీ దారణం. రేపు రిలీజ్ అనగా ఈరోజు పబ్లిసిటీ చేయడంతో సరైన మైలేజ్ లేకపోవడంతో పాటు ఆడియన్‌కు అప్పటికప్పుడు చూసే టైం లేక వేస్ట్‌గా మారిపోతుంది.
ఇటీవలే ఛాంబర్‌లో ఓ నిర్మాత దీనిపై వ్యాఖ్యానిస్తూ, ఫలానా సినిమా గురంచి ఫలానా హీరో ఇలా అన్నాడా! అని రిలీజ్ తర్వాత రోజు వరకు తెలియదట. ఇందుకు కారణం.. రోజువారీ కార్యక్రమాల్లో ప్రతివారూ మునిగిపోవడంతో పబ్లిసిటీకి పెట్టిన ఖర్చులు బూడిదలోపోసినట్లవుతుంది.
కాగా, ఇక్కడో ఆసక్తికర విషయం నెలకొంది. విడుదలకు ముందు వివిధ కాలేజీలకు చిత్ర టీమ్ వెళ్ళడం, అక్కడ వారితో ఇంట్రాక్ట్ అవ్వడంతో ఆ ఆదరణ చూసి పొంగిపోతున్నారు. దీనిని సరిగ్గా క్యాచ్ చేసిన పబ్లిసిటీకి చెందిన వారు ఏ సినిమా అయినా ప్రీరిలీజ్‌కు గ్రాండ్‌గా చేయాలని నిర్ణయించి, ఆ కాలేజీవారికి పాస్‌లు ఇచ్చి రప్పిస్తున్నారు. వారిలో కొంతమందిని ఫేక్ మీడియా పేరుతో చలామణి చేయించడం విశేషం.
ఇటీవలే ఓ స్టార్ హోటల్‌లో జరిగిన దుల్కర్ సల్మాన్ సినిమాకు మీడియా నుంచి ప్రశ్నలు అడిగే తరుణంలో కొందరు మహిళలు (ఫేక్ మీడియా) దుల్కన్ ను కౌగిలించుకోవాలనుంది. ముద్దు పెట్టుకోవాలనుందని అడగడం.. ఆ తర్వాత ఆయన అవకాశం ఇవ్వడం జరిగాయి. ఇది ఆ ఒక్క హీరోకేకాదు. అన్ని సినిమాల హీరోలకు పబ్లిసిటీ పేరుతో పబ్లిక్‌ను రాబట్టి ప్రచారం చేయడం కొత్త ఆనవాయితీగా మారింది. తాజాగా రాత్రి హ:దరాబాద్‌లో జరిగిన రెండు సినిమాల ప్రీరిలీజ్ పబ్లిసిటీకి ఇదే తంతు. ఇదే జనాలు రెండింటికీ హాజరై అక్కడి యూనిట్‌ను అలరించాయి.
మరి ఇంతమంది ఆదరణ ఉంటే సినిమాలు ఆడాలికదా. కానీ ఇలాంటి పబ్లిసిటీ సినిమాకు ఎంత వరకు ఉపయోగం అనేది విడుదల తర్వాత డమాల్ అన్నవి చాలా వున్నాయి. అసలు పెద్దగా పబ్లిసిటీలేని.. కాంతారా సినిమాకు వందల కోట్లు తెచ్చిపెట్టడంతో ఇప్పటికైనీ సదరు నిర్మాతలు, హీరోలు, పబ్లిసిటీ సంస్థలు కళ్ళు తెరవాలని సినీ పెద్దలు విశ్లేషిస్తున్నారు.