ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 19 అక్టోబరు 2022 (16:07 IST)

క‌న్న‌డ‌లో 17 రోజుల కలెక్షన్స్ తెలుగులో రెండు రోజుల్లోనేః ఆనందంలో రిషబ్ శెట్టి, అల్లు అర‌వింద్‌

Rishabh Shetty, Allu Arvind and others
Rishabh Shetty, Allu Arvind and others
హోంబలే ఫిలింస్ పతాకంపై 'కెజియఫ్' వంటి పాన్ ఇండియా హిట్ చిత్రాన్నినిర్మించిన విజయ్ కిరగందూర్ నిర్మించిన తాజా చిత్రం "కాంతార".రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో  కిషోర్ కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుమినాడు తదితరులు నటించారు.ఈ చిత్రం కన్నడ వెర్షన్ లో సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రం తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో అక్టోబర్ 15న ఈ చిత్రం  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ మాదిరిగానే తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం సంచలనం సృష్టిస్తుంది. 
 
- మొదటి రోజు 1.95 కోట్ల గ్రాస్ ను సాధించిన ఈ చిత్రం నేడు 20 కోట్లు గ్రాస్ ను సాధించింది. ఒక చిత్రం కేవలం మౌత్ టాక్ తో ఈ స్థాయిలో విజయం అవ్వడం అనేది అరుదైన విషయం..కన్నడలో భారీ విజయం సాధించిన ఈ సినిమాను,ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ "గీతా ఫిల్మ్ డిస్ట్ బ్యూషన్" ద్వారా తెలుగులో రిలీజ్ చేశారు. కన్నడలో 17 రోజుల కలెక్షన్స్ ను తెలుగులో కేవలం రెండు రోజుల్లోనే కొల్లగొట్టింది "కాంతార' చిత్రం.ఇప్పుడు తెలుగు రాష్ట్రలలో సంచలనం సృష్టిస్తుంది. 
 
ఈ సందర్బంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మేము రిలీజ్ చేసిన "కాంతార" చిత్రాన్ని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు.ఈ సినిమా ఎం ప్రూవ్ చేసింది అంటే సినిమాకు లాంగ్వేజ్ బ్యారియర్ లేదు కానీ ఎమోషన్ బ్యారియర్ ఒకటే మాత్రమే ఉంటుంది..ఏ ఎమోషన్ లో సినిమా తీశారో ఆ ఎమోషన్ కు కనెక్ట్ అయ్యి చేశారు.ఈ కథను ఇంగ్లీష్ నుండో, యూరోపియన్ నుండో, కొరియన్ నుండో చూసి రాసుకున్న కథ కాదు వారి ఊరిలో జరిగిన కొన్ని విశేషాలను తీసుకొని రాసుకున్న కథ, ఆ ఎమోషన్ కూడా ఈయనకు మట్టిలో నుండి పుట్టిన కథ ద్వారా ఫీల్ అయ్యి చాలా చక్కగా తీశారు. బన్నీ వాసు వచ్చి నన్ను అర్జంట్ గా ఈ సినిమా చూడమంటే కన్నడలో చూశాను.
 
ఈ సినిమా చూసిన తర్వాత విష్ణు తత్వం, రౌద్ర  రూపం ఇవన్నీ కలపి వైజాగ్ దగ్గర ఉన్న మన సింహాచలంకు దగ్గరగా ఉన్న కథ అనిపించింది. ఈ సినిమాలో హీరో ఎమోషన్స్ కు ఫీల్ అయ్యి  అద్భుతంగా నటించాడు అనే దానికంటే  జీవించాడు అని చెప్పవచ్చు.  అజనీష్  లోకనాథ్  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది.  జనరల్  గా నేను డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేసేది చాలా తక్కువ . ఈ సినిమా చూసిన తరువాత ఇందులోని ఎమోషన్స్ కు, హీరో పెర్ఫార్మన్స్ కు ముగ్దున్ని అయ్యి ఈ సినిమాకు కనెక్ట్ అయ్యాను.ఈ ఏమోషన్స్ తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను ఒక అవకాశంగా తీసుకొని  గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్" ద్వారా తెలుగులో రిలీజ్ చేయడం జరిగింది. అనుకున్నట్టే థియేటర్స్ లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడిని ఈ సినిమా కట్టిపడేస్తుంది.అన్ని చోట్ల  నుండి ఊహించని రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది .డిఫరెంట్ ఫిలిం కావాలనుకునే వారికి "కాంతారా" సినిమా కచ్చితంగా నచ్చుతుంది. త్వరలో రిషబ్ శెట్టి మా గీతా ఆర్ట్స్ లో సినిమా చేయడానికి ఒప్పు కున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.
 
చిత్ర హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి మాట్లాడుతూ..మా "కాంతార"  సినిమాను అగ్ర నిర్మాత అల్లు అరవింద్ గారు షార్ట్ టైమ్ లో "గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్" ద్వారా తెలుగులో  రిలీజ్ చేయడంతో రిలీజైన ప్రతిచోటా తెలుగు  ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకు సహకరించిన రామారావు గారికి ధన్యవాదాలు. ఈ సినిమా నాకు మంచి ఎనర్జీ నిచ్చింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదని తెలుగు ప్రేక్షకులు నిరూపించారు. మూడు రోజుల్లో 20 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి.ఇంత విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదములు. చిన్నప్పటి నుండి ఇక్కడ జరిగే విషయాలను చూస్తూ పెరిగాను. వారాహ రూపం అనేది విష్ణు మూర్తికి కనెక్ట్ అవుతుంది. కనుక  దాంతో మా కల్చర్ కు ఎమోషన్స్ జోడించి ఈ సినిమా చెయ్యడం జరిగింది. మా కాంతార చిత్రం  ద్వారా  మాకింత పెద్ద విజయాన్నిచ్చిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు.
 
హీరోయిన్  సప్తమి గౌడ మాట్లాడుతూ..లీలపాత్రలో నన్ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదములు అన్నారు. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు  ధన్యవాదాలు అన్నారు.
 
లిరిక్ రైటర్ రాంబాబు గోశాల మాట్లాడుతూ..చాలామంది  ఈ సినిమా లోని పాటలు  అచ్చమైన తెలుగు పాటలు లాగే వున్నాయి అంటున్నారు. ఇండియా వైడ్ ఈ సినిమా బిగ్ హిట్ అయ్యినందుకు చాలా హ్యాపీగా ఉందని అన్నారు.