SV Krishna Reddy, Khar Kammula,Sohel Mrinalini, C. Kalyan, Koneru kalpana
ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్గానిక్ మామ`హైబ్రిడ్ అల్లుడు. నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్`మీనా ప్రధాన పాత్రల్లో కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్, ప్రఖ్యాత బ్యానర్ కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన నిర్మిస్తున్నారు. బిగ్‌బాస్ ఫేం సోహెల్`మృణాళిని జంటగా నటిస్తున్నారు.
తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డిగారు ఈ చిత్రానికి మాటలు కూడా రాయడం మరో విశేషం. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల విచ్చేసి ట్రైలర్, టీజర్‌లను లాంచ్ చేశారు.
అనంతరం శేఖర్ కమ్ముల మాట్లాడుతూ... కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం ఎస్.వి. కృష్ణారెడ్డి అనే ఈ టైటిల్ కార్డు చూసి చాలా రోజులు అయ్యింది. అది చూస్తుంటేనే చాలా సంతోషం అనిపిస్తోంది. కృష్ణారెడ్డి గారి సినిమాలు అంటే ఒక రిలీఫ్. అన్ని వర్గాలకు కావాల్సిన అన్ని అంశాలనూ చక్కగా ఏర్చి, కూర్చి అద్భుతమైన సంగీతంతో మనకు అందిస్తారు. ఉరుకు, పరుగుల ప్రస్తుత జనరేషన్‌కు రిలీఫ్ కోసం కృష్ణారెడ్డిగారి సినిమాలు ఎంతో అవసరం అని నా భావన. ఆయన సినిమాలు కమర్షియల్ హంగులతో ఉంటూనే పిల్లలకు కూడా ఫేవరెట్‌గా ఉంటాయి. ట్రైలర్ చూసిన తర్వాత కృష్ణారెడ్డిగారు కమ్‌బ్యాక్ అని గట్టిగా చెప్పవచ్చు. ఆయన మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాను ఇంత అద్భుతంగా నిర్మించిన నిర్మాత కోనేరు కల్పన గారికి యూనిట్ సభ్యులకు నా కృతజ్ఞతలు అన్నారు.
నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ, ఈ సినిమా డెఫనెట్‌గా సూపర్‌హిట్ అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఫ్యామిలీస్ అందరూ థియేటర్స్‌కు రావడం మానేసి ఇంట్లోనే ఓటీటీలో సినిమాలు చూడటానికి అలవాటు పడ్డారు. కారణం ఫ్యామిలీస్‌ను థియేటర్స్‌కు రప్పించే కంటెంట్ సినిమాల్లో తగ్గి పోవడమే. అటువంటి కంటెంట్‌కు కేరాఫ్ అడ్రస్ కృష్ణారెడ్డిగారు. కాబట్టి తప్పకుండా ఈ సినిమాతో మళ్లీ థియేటర్స్ ఫ్యామిలీ ఆడియెన్స్‌తో కళకళలాడతాయి అని నాకు గట్టి నమ్మకం. ఇక రాజేంద్రప్రసాద్ నా హీరో, ఆయనతో ఎక్కువ సినిమాలు చేశాను. మీనాగారు అయితే ఆమె భర్త చనిపోయి బాధలో ఉన్నప్పటికీ నిర్మాతల శ్రేయస్సు ముఖ్యం అని భావించి, ఆయన చనిపోయిన దాదాపు 15 రోజుల తర్వాత షూటింగ్‌కు హాజరయ్యారు. మరొక ఆర్టిస్ట్ అయితే ఇలా ఖచ్చితంగా సహకరించి ఉండేవారు కాదు. ఈ సినిమా కోసం సోహెల్ కూడా కష్టపడ్డాడు. నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ సినిమా అందరికీ హిట్ ఇస్తుందని ఆశిస్తున్నా అన్నారు.
ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, నేను 40 సినిమాలు చేశాను. ఈ సినిమా నిర్మాత కల్పన గారి డెడికేషన్, ప్లానింగ్ చూసిన తర్వాత ఈ ప్రొడక్షన్ హౌస్ నా కెరీర్‌లో ది బెస్ట్ అని చెపుతున్నాను. కరోనా టైంలోనే ఈ కథను రెడీ చేసుకున్నాను. ఆ సమయంలో అచ్చిరెడ్డి ఫోన్ చేసి,మాటలు రాసేలా చేశారు. రాజేంద్రప్రసాద్ గారు అయితే.. డబ్బింగ్ టైంలో కొన్ని సీన్లు చూసి ఏంటి నేను ఇంత బాగా చేశానా, ఇంత ఎమోషన్ ఈ కేరెక్టర్‌లో ఉందా? అని ఆశ్చర్య పోయారు. ఆయన నటనలో ఒక అద్భుతం అంతే. ఇక మీనా గారి గురించి ఏం చెప్పాలి ఆమె సూపర్ నటి. ఈ సినిమా టైటిల్ కల్పనగారే పెట్టారు. ఇంతమంది మంచి మనుషులు నా చుట్టూ ఉంటే నా నుంచి ఒక పెద్ద హిట్ ఎందుకు రాకుండా ఉంటుంది. తెరకెక్కించడంలో కెమెరామెన్ సి. రాంప్రసాద్ గారు అద్భుతంగా పనిచేశారని అన్నారు.
హీరో సోహెల్ మాట్లాడుతూ... నేను చిన్నప్పటి నుంచి కృష్ణారెడ్డి గారి సినిమాలు చూసి పెరిగాను. ఇప్పుడు ఆయన దర్వకత్వంలో నటించడం అంటే ఇప్పటికీ నమ్మలేని విషయంగానే అనిపిస్తుంది. నాకు ఆయన దర్శకత్వంలో పనిచేసే అవకాశం రావటానికి ముఖ్య కారకులైన సంతోషం సురేష్ గారికి నా కృతజ్ఞతలు. నాలోని టాలెంట్‌ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత కల్పన గారికి నా థ్యాంక్స్. బిగ్‌బాస్ వల్ల నేను చాలా మందికి పరిచయం అయ్యాను. ఇప్పుడు కృష్ణారెడ్డి గారి సినిమా అంటే ఇక ప్రతి కుటుంబానికి చేరువౌతాను అనే నమ్మకం ఉంది. ఇప్పుడు కష్టపడినట్టే ఇక ముందు కూడా కష్టపడుతూనే ఉంటాను అన్నారు.
నటుడు ఆలీ మాట్లాడుతూ... ఇది ఒక అద్భుతమైన కాంబినేషన్. పైగా మామ, అల్లుడు కాంబినేషన్ అనేది హిట్ ఫార్ములా. కాబట్టి ఈ సినిమా ఆల్రెడీ సక్సెస్ అయినట్టే భావించాలి. నిర్మాత కల్పనగారు యూనిట్‌ను తన కుటుంబ సభ్యులుగా చూసుకున్నారు. సోహెల్ తనకు ఈ సినిమా అవకాశం వచ్చింది అని చెప్పగానే నేను చాలా హ్యాపీగా ఫీలయ్యా. కృష్ణారెడ్డి గారి హ్యాండ్ పడిరది అంటే ఇక సోహెల్ స్టార్ అయినట్టే. మా గురువుగారు కృష్ణారెడ్డి గారికి మళ్లీ ఈ సినిమా పూర్వ వైభవం తీసుకురావాలని కోరుకుంటున్నా అన్నారు.
ఇంకా అచ్చిరెడ్డి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకుడు, పంపిణీదారుడు ముత్యాల రాందాస్, నటి హేమ నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ తదితరులు మాట్లాడారు.