సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 అక్టోబరు 2022 (19:47 IST)

సీఎం జగన్‌పై అలీ నమ్మకం వమ్ము కాలేదు.. ఎట్టకేలకు పదవి

ALi_Jagan
కమెడియన్, వైసీపీ నేత అలీ నమ్మకం వమ్ము కాలేదు. ఏపీ సీఎం జగన్ రెడ్డిపై ఆయన పెట్టుకున్న నమ్మకం పదవి రూపంలో ఆయనను వరించింది. అవును అలీకి ఎట్టకేలకు పదవి దక్కింది. ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా అలీ నియమితులయ్యారు. 
 
ఈ మేరకు ఆయనను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో అలీ రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. ఇతర ప్రభుత్వ సలహాదారుల మాదిరిగానే అలీకి జీతభత్యాలు లభించనున్నాయి.
 
2019 ఎన్నికలకు ముందే వైసీపీలో చేరిన అలీ.. ఓపిగ్గా వైకాపా తరపున పనిచేశారు. జనసేనలో ఆయన చేరుతారని ప్రచారం సాగింది. అయినా జనసేనలో చేరేది లేదని.. జగన్ చెంతనే వుంటానని అలీ ప్రకటించారు. పవన్ స్నేహితులైనా.. రాజకీయాల పరంగా జగన్‌తోనే వుంటానని చెప్పుకొచ్చారు. అయితే ఎలాంటి పదవి ఆశించలేదనే పలు సందర్భాల్లో చెప్పారు. అయితే ఏపీ సీఎం జగన్ అలీకి పదవి అప్పగించారు. తాజాగా అలీకి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవిని అందజేశారు.