మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 అక్టోబరు 2022 (10:24 IST)

నవంబరు 4 నుంచి విస్తారంగా వర్షాలు...

rain
దక్షిణ భారతదేశంలో ఈ నెల 29వ తేదీ నుంచి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే, వచ్చే నెల నాలుగో తేదీ నుంచి విస్తారంగా వర్షాల కురుస్తాయని దక్షిణ మండల వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. 
 
ఇదే అంశంపై ఆ కేంద్రం డైరెక్టర్ బాలచంద్రన్ మాట్లాడుతూ, తమిళనాడు, కేరళ, దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాలు ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభమయ్యేలా అనుకూల వాతావరణ పరిస్థితులు నెలకొనివున్నాయని తెలిపారు. ఈ కారణంగా నవంబరు నాలుగో తేదీ నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. 
 
తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాజధాని చెన్నై నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పారు. రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత క్రమంగా వర్షాలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. సిత్రాంగ్ తుఫాను కారణంగా ఈశాన్య రుతుపవనాల ప్రవేశంలో జాప్యం జరిగిందని తెలిపారు. ఈ యేడాది రుతుపవనాల కారణంగా 45 శాతం అదిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆయన వివరించారు.