1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

27-10-2022 గురువారం దినఫలాలు - పంచముఖ ఆంజనేయుని తమలపాకులతో పూజిస్తే.. .

anjaneya swamy
మేషం :- దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి. పోస్టల్, ఏసీ ఏజెంట్లకు కలసిరాగలదు. నిరుద్యోగులకు నిరుత్సాహం తప్పదు. దూర ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ సమర్థతపై భాగస్వామికులకు నమ్మకం కలుగుతుంది.
 
వృషభం :- కళలు, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. బంధువుల ఆకస్మిక రాక వల్ల గృహంలో సందడి కానవస్తుంది. చిన్నతరహా పరిశ్రమలు, వృత్తులు, ముఠా కార్మికులకు కలిసిరాగలదు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత ఎంతో ముఖ్యం.
 
మిథునం :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. స్త్రీలకు బంధువర్గాల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలను ఎదుర్కుంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లతీరు ఆందోళన కలిగిస్తుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. మీ సంతానం భవిష్యత్తు బాగుంటుంది.
 
కర్కాటకం :- ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు పోకుండా దూరంగా ఉండటం శ్రేయస్కరం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. దంపతుల మధ్య దూరపు బంధువుల ప్రస్తావన వస్తుంది. ఆకస్మిక ఖర్చుల వల్ల ఒకింత ఒడిదుడుకులుతప్పవు.
 
సింహం :- ప్రింటింగు, స్టేషనరీ రంగాలలో వారికి నిరుత్సాహం కానవస్తుంది. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. గృహ నిర్మాణాలలో స్వల్ప అడ్డంకులు, చికాకులు ఎదుర్కొంటారు. స్త్రీల అభిప్రాయాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యం అవసరం.
 
కన్య :- స్త్రీలకు షాపింగ్లో నాణ్యతను గయనించాలి. రుణాల కోసం అన్వేషిస్తారు. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ఉద్యోగస్తులు తోటివారితో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. మీడియా రంగాల వారికి పనిభారం అధికం.
 
తుల :- ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కోర్టు వ్యావహారాలలో ప్లీడర్లు చికాకులను ఎదుర్కొంటారు. బ్యాంకు వ్యవహారాలలో హామిలు, మధ్యవర్తిత్వం వహించడం వలన మాట పడవలసివస్తుంది. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు.
 
వృశ్చికం :- ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి. గృహంలో వస్తువు పోవడానికి అవకాసం ఉంది జాగ్రత్త వహించండి. సంగీత కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ వ్యక్తులతో స్వల్ప విరోధముల రావచ్చు. జాగ్రత్త వహించండి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం.
 
ధనస్సు :- ఉపాధ్యాయులకు పని భారం అధికమవుతుంది. పారిశ్రామిక రంగాల వారికి ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. విద్యార్థులు స్వయం కృషితో రాణిస్తారు. పై అధికారులు, ప్రముఖలతో వాగ్వివాదాలకు దిగకండి. ప్రయాణాలు, వ్యూహాల అమలులో జాగ్రత్త అవసరం.
 
మకరం :- మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. సాహస ప్రయత్నాలు విరమించండి. తల, కణతకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనవలసి వస్తుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఊహించని ఖర్చు వల్ల చేబదుళ్ళు తప్పవు.
 
కుంభం :- ఉపాధ్యాయులకు విశ్రాంతి లోపం వల్ల అలసట అధికమవుతుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. మీకందిన చెక్కులు చెల్లక ఇబ్బందు లెదుర్కుంటారు. ఒక ప్రకటన మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. మీ కదలికలపై నిఘా ఉందన్న విషయాన్ని గమనించండి. సోదరి, సోదరులతో అవగాహనకుదరదు.
 
మీనం :- మీ శ్రీమతి సలహాను తేలికగా కొట్టివేయటం మంచిదికాదు. బంధు మిత్రుల కలయికమీకెంతో సంతృప్తి కానవస్తుంది. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి కలిసివస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేయు కృషి ఫలిస్తుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ధైర్యంతో మందడుగు వేస్తే తప్ప అది ఆనందదాయకం కాదు.