బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

25-10-2022 మంగళవారం దినఫలాలు - హనుమాన్ ఆరాధన వల్ల ఆర్థికాభివృద్ధి..

Weekly Astrology
మేషం :- ఉపాధ్యాయుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. బంధువుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. మీపై వచ్చిన అపోహలు తొలగిపోగలవు. మీపై శకునాల ప్రభావం అధికం. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సహోద్యోగులతో కీలక సమావేశాల్లో పాల్గొంటారు. చిరువ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
 
వృషభం :- మీ అభిప్రాయాలను సూచనప్రాయంగా తెలియజేయండి. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదాపడతతాయి. కుటుంబ, ఆరోగ్య సమస్యలు సర్దుకుంటాయి. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఉద్యోగ బాధ్యతల్లో చిన్న చిన్న తప్పులు దొర్లే ఆస్కారం ఉంది.
 
మిథునం :- ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలించవు. వృత్తుల వారికి ప్రజాసంబంధాలు బలపడతాయి. హామీలిచ్చి ఇబ్బందులెదుర్కుంటారు. పరిచయస్తుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. నిరుద్యోగులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. కీలక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. పాత రుణాలు తీరుస్తారు.
 
కర్కాటకం :- ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. రేషన్ డీలర్లు, మద్యం వ్యాపారులకు చికాకులు అధికమవుతాయి. మీ శ్రీమతి హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. అవసరానికి ధనం అందక ఇబ్బందులెదుర్కుంటారు. సంతానం కదలికలను గమనిస్తుండాలి.
 
సింహం :- వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వాయిదాపడతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. ఇతరుల సలహా కంటే సొంత నిర్ణయాలే శ్రేయస్కరం. రావలసిన ఆదాయం అందుతుంది. ఓర్పు, శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. సోదరుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఎదుటివారి అభిప్రాయాలకు విలువనివ్వండి.
 
కన్య :- మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏమరుపాటు తగదు. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. వ్యాపారాల్లో ఆటంకాలు, నష్టాలను అధిగమిస్తారు. మీ పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలిస్తాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి.
 
తుల :- పెద్దమొత్తం ధనసహాయం క్షేమం కాదు. వాణిజ్య ఒప్పందాల్లో తొందరపాటు తగదు. నమ్మిన వ్యక్తులే తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది. కొత్త ఆలోచనలు, పథకాలతో ముందుకు సాగుతారు. ఇతరులనుమీ విషయాలకు దూరంగా ఉంచండి. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. కోర్టు వాయిదాలు విసుగు కలిగిస్తాయి. 
 
వృశ్చికం :- స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం. పెద్దల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు, ఇతరత్రా చెల్లింపులు జరుపుతారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. విద్యార్థులకు కొత్త పరిచయాలు సంతృప్తినిస్తాయి.
 
ధనస్సు :- బంధు మిత్రులతో పట్టింపులు, విభేదాలు తలెత్తుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. పోగొట్టుకున్న వస్తువులు, పత్రాలు తిరిగి పొందుతారు. తల, ఎముకలకి సంబంధించిన చికాకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోగలవు. ఆత్మీయులు, కుటుంబీకులతో ఉత్సాహంగా గడుపుతారు.
 
మకరం :- దైవ, సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఉద్యోగయత్నంలో బిడియం, భేషజం తగవు. పెద్ద సంస్థల్లో భాగస్వామ్యం అనుకూలిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు రూపొందించుకుంటారు. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి.
 
కుంభం :- ఉపాధ్యాయులు సభ, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. హోల్ సేల్ వ్యాపారులు, స్టాకిస్టులు అప్రమత్తంగా ఉండాలి. సహోద్యోగుల సాయంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. రుణ విముక్తులు కావటంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు. నిరుద్యోగులకు ప్రకటనలపై అవగాహనముఖ్యం.
 
మీనం :- ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకోగల్గుతారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంలోను ఆసక్తి పెద్దగా ఉండదు. ఓర్పుతో సమస్యలు పరిష్కరించుకోవాలి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. బంధువుల వ్యాఖ్యలు తరుచు గుర్తు కొస్తుంటాయి. పనులు మొదలెట్టే సమయానికి ఆటంకా లెదురవుతారు.