శనివారం, 2 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

20-10-2022 గురువారం దినఫలాలు - దత్తాత్రేయుడని ఆరాధించిన సంకల్ప సిద్ధి...

Astrology
మేషం :- దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. ఉపాధ్యాయులకు యాజమాన్యం నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. రాజకీయ రంగాల్లో వారికి కొంత చికాకులు ఎదురవుతాయి.
 
వృషభం :- బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. విదేశాలు వెళ్ళడానికి చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకం. కుటుంబంలో ఏర్పడిన వాదనలను పట్టించుకోకపోవడం మంచిది. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
మిథునం :- స్త్రీలకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలువస్తాయి. గత అనుభవంతో వర్తమానంలో ఒక సమస్యను అధిగమిస్తారు. చిన్న చిన్న విషయాలలో ఏకీభావం కుదరదు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. 
 
కర్కాటకం :- వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. సోదరి, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. కీర్తి ప్రతిష్టలకు కించిత్ భంగం వాటిల్లే సూచనలున్నాయి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం.
 
సింహం :- కుటుంబ అవసరాలు మరింతగా పెరుగుతాయి. ఉద్యోగస్తుల సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు చేసే పనులకు ఆక్షేపణలు ఎదుర్కుంటారు. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత అవసరం. కోర్టు వ్యవహరాల్లో ఫ్లీడర్ల ధోరణి నిరుత్సాహపరుస్తుంది. ఖర్చులు అదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది.
 
కన్య :- ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. రుణయత్నాలలో ఆటంకాలు తొలగిపోయి రావలసిన ధనం చేతికందుతుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు ఫలిస్తాయి. రాజకీయ నాయకులు తరచూ సభ, సమావేశాలు, వేడుకల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తి చేస్తారు.
 
తుల :- ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రేమికులు అతిగా వ్యవహరించటంవల్ల భంగపాటు తప్పదు. మీ మాటలు ఇతరులకు జారవేసే వ్యక్తులున్నారన్న విషయం గమనించండి. బంధు మిత్రుల కలయిక సంతోషాన్ని, ప్రశాంతతను కలిగిస్తుంది. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో నిరాశ తప్పదు.
 
వృశ్చికం :- నిత్యావసర వస్తు స్టాకిస్టులు, రేషన్ డీలర్లకు ఊహించని పరిణామా లెదురవుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి పని భారం అధికం. విదేశీయానం యత్నాలు ఫలిస్తాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు, క్రయ విక్రయాల లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, గృహోపకరణ వ్యాపారాలు పుంజుకుంటాయి.
 
ధనస్సు :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా నిర్వహిస్తారు. ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు, క్లయింలు మంజూరవుతాయి. మీరు చేసే కృషి వల్ల మీ ప్రతిభ వెలుగులోనికి వచ్చి మంచి విజయం సాధిస్తారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ద వహించండి.
 
మకరం :- నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఒత్తిడి తప్పదు. ఒక శుభకార్యం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. వ్యాపారాలు, వ్యాపారాల విస్తరణలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. మీ సాయం పొందిన వారే వేలెత్తి చూపుతారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి.
 
కుంభం :- వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన మార్పులుంటాయి. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. బంధు మిత్రుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కుంటారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. రుణ యత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన అవసరం.
 
మీనం :- ప్రింటింగ్ రంగాల వారు అక్షర దోషాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఆదాయం పెంచుకునే దిశగా ఆలోచనలుంటాయి. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. అందివచ్చిన అవకాశం చేజారినా ఒకందుకు మంచిదేనని అనిపిస్తుంది. ఇంటా, బయటా మీ మాటకు మంచి స్పందన లభిస్తుంది.