శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

18-10-2022 మంగళవారం దినఫలాలు - ఆంజనేయస్వామిని ఆరాధిస్తే శుభం...

Weekly Astrology
మేషం :- మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
వృషభం :- నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. సోదరీ, సోదరులతో ఏకీభించలేకపోతారు. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. ప్రతి విషయంలోను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.
 
మిథునం :- వృత్తి, వ్యాపారులకు సంతృప్తి కానవస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. రహస్య విషయాలను తెలుసుకొంటారు. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. మిత్రులను కలుసుకుంటారు. తల పెట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు తలెత్తుతాయి.
 
కర్కాటకం :- పెద్ద హోదాలో ఉన్న వారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం. గృహములో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు.
 
సింహం :- మీ చర్చలలో కొన్ని లోపాలు తలెత్తుట వలన మాటపడక తప్పక పోవచ్చు. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులు కొత్త యత్నాలు మొదలెడతారు. మీ అభిరుచి, ఆశయాలకు సంబంధించిన వ్యక్తులతో పరిచయా లేర్పడతాయి.
 
కన్య :- వృత్తుల వారు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. ఖర్చులు, రాబడి విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. పారిశ్రామిక రంగాల వారికి అధికారులు, చుట్టుపక్కల వారి నుంచి అభ్యంతరాలు ఎదుర్కోవలసి వస్తుంది. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు.
 
తుల :- స్త్రీలకు ప్రకటనలు, స్కీముల పట్ల అవగాహన అవసరం. మీ ఆంతరంగిక, వ్యాపార విషయాలు గోప్యంగా ఉంచండి. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకం. మీ కుటుంబీకుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. మీ చర్చలలో కొన్ని లోపాలు తలెత్తుట వలన మాటపడక తప్పక పోవచ్చు.
 
వృశ్చికం :- ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. మీ సంతానం ఉన్నతికి మంచి పథకాలు రూపొందిస్తారు. క్రయ విక్రయ రంగాలలో వారికి అనుకూలం. తల, కణతకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనవలసివస్తుంది. ప్రభుత్వ సంస్థలలో పనులు పూర్తవుతాయి.
ధనం బాగా అందుట వలన ఏ కొంతయినా నిల్వచేయగలుగుతారు. 
 
ధనస్సు :- వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో రాణిస్తారు. ఉపాధి పథకలపై నిరుద్యోగులు దృష్టిసారిస్తారు. నిర్మాణ పనులలో కాంట్రాక్టరు. బిల్డర్లకు చికాకులు తప్పవు. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యం అవసరం. శ్రమకు తగినఫలితం పొందుతారు.
 
మకరం :- ఉద్యోగస్తులకు స్థానమార్పిడి, కొత్త బాధ్యతల చేపట్టే అవకాశం ఉంది. బంధు మిత్రుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కుంటారు. చేపట్టిన పనులు నిర్విఘంగా పూర్తి చేస్తారు. మీ యత్నాలకు సన్నిహితులు అన్ని విధాలా సకారం అందిస్తారు. కుటుంబీకుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
 
కుంభం :- వస్త్ర, బంగారు, వెండి రంగాలలో వారికి కలిసిరాగలదు. స్థిరాస్థి విషయం గురించి ఆలోచిస్తారు. బంధువుల రాకవల్ల గృహంలో కొత్త ఉత్సాహం, సందడి చోటుచేసుకుంటుంది. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువలు అవసరం. సోదరుల మధ్య కలహాలు అధికం. సంగీత కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది.
 
మీనం :- ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త సమస్యలు తలెత్తుతాయి. ఖర్చులు, కుటుంబ అవసరాలు మరింతగా పెరుగుతాయి. విద్యార్థులకు వసతి లభిస్తుంది. స్త్రీలకు పనివారితో చికాకులు అధికమవుతాయి. స్పెక్యులేషన్ కలిసిరాదు. బంధు మిత్రుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది.