సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

19-10-2022 బుధవారం దినఫలాలు - లక్ష్మీనృసింహస్వామిని ఆరాధిస్తే?

లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన మీ సంకల్పం నెరవేరుతుంది. 
 
మేషం:- పత్రిక, ప్రైవేట్ రంగంలోని వారికి చికాకులు తప్పవు. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి, శ్రమాధిక్యత అధికమవుతాయి. చేపట్టిన పనులు ఆశించినంత చురుకుగాసాగవు. ఉద్యోగస్తులు శక్తివంచన లేకుండా శ్రమించి అధికారులను మెప్పిస్తారు. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
 
వృషభం :- గృహంలో మార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదాపడతాయి. వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరిక నెరవేరుతుంది. అదనపు సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తారు. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహరాలల్లో పురోగతి కనిపిస్తుంది.
 
 
మిథునం:- ఆస్తి వ్యవహారాల్లో పెద్దల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఇంతకాలం పడిన శ్రమ ప్రతిఫలం దక్కుతుంది. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. ఉద్యోగస్తుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులు ప్రకటనల పట్ల ఆకర్షితులవుతారు.
 
 
కర్కాటకం:- ఐరన్, సిమెంట్, కలప వ్యాపారస్తులకు శుభదాయకం. మీరు తీసుకునే నిర్ణయాలకు కుటుంబీకుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి కావస్తుంది. ఉద్యోగస్తులు విధినిర్వహణలో ఏకాగ్రతతో పనిచేయవలసి ఉంటుంది. మీ చిన్నారుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. 
 
సింహం:- దైవ కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. 
రావలసిన బకాయిలు సకాలంలో అందుటవలన ఆర్ధిక ఇబ్బంది అంటూ ఉండదు. ప్లీడరు, ప్లీడరు గుమస్తాలకు పురోభివృద్ధి అవసరం. పెద్దలు, అనుభవజ్ఞుల సలహాలు పాటించటంవల్ల ఒక సమస్య నుంచి క్షేమంగా బయట పడతారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
 
కన్య:- కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ప్రత్తి, పొగాకు రంగాలలో వారికి అనుకూలమైన రోజు. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. రాజకీయాలలో వారికి మెళకువ అవసరం. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాల సందర్శనాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగ యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.
 
 
తుల:- తల, ఎముకలకి సంబంధించిన చికాకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోగలవు. ముందు చూపుతో వ్యవహరించండి. వాహన సౌఖ్యం పొందుతారు. ఫైనాన్స్, చిట్ ఫండ్ వ్యాపారస్తులకు నూతన ఉత్సాహం కానవస్తుంది. సోదరి, సోదరులతో అవగాహన కుదరదు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు.
 
 
వృశ్చికం:- ఆర్ధిక పరిస్థితిలో ఆశిస్తున మార్పులు సంభవిస్తాయి. పాత వ్యవహారాలు మీకు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. చేపట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయటం వల్ల మీ కీర్తి, ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి.
 
 
ధనస్సు:- ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్న ప్రమోషన్ అందుకుంటారు. మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
 
మకరం:- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. భాగస్వామిక వ్యాపారాలలో కష్టనష్టాలు ఎదుర్కొవలసి వస్తుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. దుబారా ఖర్చులు అధికం. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా ఉంటాయి. వాహనం కొనుగోలు చేయు ప్రయత్నాలలో జయం చేకూరును.
 
 
కుంభం:- ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. నిరుద్యోగ యత్నాలకు మంచి సలహా, సహాకారం లభిస్తుంది. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. బ్యాంకింగ్ పనులు మందకొడిగా సాగుతాయి. అనుకోని విధంగా మీరు ప్రయాణం చేయవలసి వస్తుంది.
 
 
మీనం:- చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. ప్రయాణాలు అనుకూలం. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. పెద్దలతో పరస్పర ఏకీభావం కుదురుతుంది. ఊహించని ఖర్చుల వల్ల ఒకింత ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.