గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

21-10-2022 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవిని పూజించి, అర్చించిన శుభం..

lakshmidevi
మేషం :- ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు చేపట్టవలసి ఉంటుంది. రిప్రజెంటటేవ్‌లు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద పూర్తి చేస్తారు. స్త్రీలలో కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. బంధువులను కలుసుకుంటారు. తీర్థయాత్రలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. కొంత మంది మీ నుంచి కీలకమైన విషయాలు రాబట్టేందుకు యత్నిస్తారు.
 
వృషభం :- కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు చేపట్టిన పనులలో ఏకాగ్రత అవసరం. ఆపత్సమయంలో మిత్రులకు అండగా నిలుస్తారు. ప్రతి విషయంలోను బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. మీ ఉన్నతిని చాటుకోవటానికి ధనం విరివిగా వ్యయం చేయవలసి ఉంటుంది.
 
మిథునం :- గృహ మరమ్మతులు, నిర్మాణాలు చేపడతారు. దంపతుల మధ్య కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. అయిన వారే మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. అధ్యాపకులకు పురోభివృద్ధి. కొబ్బరి, పండ్ల, పూల, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి.
 
కర్కాటకం :- వృత్తి వ్యాపారాల్లో ప్రతికూలతలెదురవుతాయి. బంధు మిత్రులతో కలసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఏకాగ్రత లోపం వల్ల మాటపడవలసి వస్తుంది. తరుచు దైవకార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. ఉత్తర ప్రత్యుత్తరాలు, రాయబారాలు సమర్థంగా నిర్వహిస్తారు.
 
సింహం :- ఏజెంట్లు, బ్రోకర్లకు ఒత్తిడి, శ్రమ అధికమవుతాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. విదేశాల్లోని అయిన వారి క్షేమ సమాచారాలు సంతృప్తినిస్తాయి. శారీరక శ్రమ, మానసికాందోళన వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వృత్తిపరంగా ఎదురైన సమస్యల నుంచి బయటపడతారు.
 
కన్య :- ఆర్థికంగా ఒక అడుగు ముదుకు వేస్తారు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ద్విచక్ర వాహనం పై దూరప్రయాణాలు శ్రేయస్కరం కాదని గమనించండి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయకండి. 
 
తుల :- రవాణా రంగాల వారికి చికాకులు తప్పవు. ఖర్చులు అధికం కావటంతో రుణాలు, చేబదుళ్ళు తప్పవు. సోదరీ, సోదరులతో సఖ్యత నెలకొంటుంది. మధ్య మధ్య ఔషధ సేవ తప్పదు. చిట్స్, ఫైనాన్సు, బ్యాంకింగ్ రంగాల వారికి ఖాతాదారులతో సమస్యలు అధికమవుతాయి. స్త్రీ సౌఖ్యం, ఆకస్మిక ధనప్రాప్తి పొందుతారు.
 
వృశ్చికం :- వస్త్ర, బంగారం, వెండి, వ్యాపారులకు పురోభివృద్ధి. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి సామాన్యం. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అసవరం.
 
ధనస్సు :- ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానరాదు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి చికాకుతప్పదు. పొట్ట, నరాలకు సంబంధించిన సమస్యలు అధికమవుతాయి. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. కళత్ర మొండి వైఖరిచికాకు కలిగిస్తుంది. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
 
మకరం :- స్థిరాస్తిని అమ్మటానికి చేయు ప్రయత్నంలో పునరాలోచన మంచిది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అసవరం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. రియల్ ఎస్టేట్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది.
 
కుంభం :- విజ్ఞతతో వ్యవహారించి రుణదాతలను సమాధాన పరుస్తారు. కోర్టు వ్యవహరాలు, ఆస్తి తగాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగస్తులు తరుచు సభలు, సమావేశాలు, చర్చల్లో పాల్గొంటారు. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. 
 
మీనం :- నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు లాభదాయకం. పోస్టల్, కొరియర్ రంగాల వారికి పనిభారం తప్పవు. స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. కోర్టు వ్యవహరాలు, ఆస్తితగాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు.