సంబంధిత వార్తలు
- పోస్ట్ ప్రొడక్షన్ దశలో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి మట్టి కుస్తీ
- మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్యలో ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్
- కాజల్ అగర్వాల్ విడుదల చేసిన విష్ణు విశాల్ మట్టి కుస్తీ లుక్
- విష్ణు విశాల్ మట్టి కుస్తీ ఫస్ట్ లుక్‌ని లాంచ్ చేసిన రవితేజ
- వరలక్ష్మి శరత్ కుమార్ మాటలు వింటే దడుసుకుంటారు
రవితేజ ధమాకా నుండి లిరికల్ వీడియో వచ్చింది
Ravi Teja, Srileela
ఈ రోజు ఈ చిత్రం నుండి వాట్స్ హ్యాపెనింగ్ లిరికల్ వీడియో విడుదల చేశారు మేకర్స్. భీమ్స్ సిసిరోలియో ఈ పాటని మనసుని హత్తుకునే మెలోడీ గా కంపోజ్ చేశారు. శేఖర్ మాస్టర్ ఈ పాటని చాలా గ్రేస్ ఫుల్ గా కోరియోగ్రఫీ చేశారు. శ్రీలీల డ్యాన్స్ మూమెంట్స్ స్టయిలీష్ గా ఆకట్టుకున్నాయి.
ఈ పాటకుసరస్వతి పుత్ర రామ జోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హీరోయిన్ మనసులోని ఫీలింగ్స్ ని అందంగా, మ్యాజికల్ గా ప్రజంట్ చేశారు. రమ్య బెహరా, భార్గవి పిళ్లై తమ వాయిస్ తో మెస్మరైజ్ చేశారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ గా. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు.
డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది.
తర్వాతి కథనం
