గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 2 నవంబరు 2022 (13:15 IST)

వరలక్ష్మి శరత్ కుమార్ మాటలు వింటే దడుసుకుంటారు

Varalakshmi Sarath Kumar,
Varalakshmi Sarath Kumar,
నటి వరలక్ష్మి శరత్ కుమార్ కు మొదట్లో వాయిస్ బాగోలేదని అవకాశాలు రాలేదట. కానీ సోషల్ మీడియాలో తన వోయిసుకు మంచి ఫాలోయింగ్ ఉందని తెలియజేస్తుంది. రవితేజ నటించిన సినిమాలో జయమ్మ పాత్రకు బాగా పేరు వచ్చింది. ఆ తర్వాత బాగానే అవకాశాలు వస్తుంన్నాయి. లేటెస్టుగా యశోద సినిమాలో నటించింది. ఈ సందర్భం గా కొన్ని విషయాలు చెప్పింది. పొన్నియన్ సెల్వన్ వంటి సినిమాలో నటించలేక పోయానని అంది. అలాంటి కథలు వస్తే వదులుకోనని అంది.
 
అయితే సెట్లో చాలా డిగ్నిఫైడ్జ్ ఉండే వరలక్ష్మి తన స్నేహితులతో చాలా సరదాగా గడుపుతుంది. గంటలపాటు వారితో మాట్లాడే మాటలు వింటే మీకు భయమేస్తుంది. మేము చాలా దారుణంగా మాటలాడుకుంటామని మనసులోని మాట చెప్పింది. తాజాగా యశోద షూటింగ్ లో ఉండగా సమంత, నేను కలిసి ఒక కారులో అరగంట ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పుడు బాగా వర్షం పడుతుంది. ఆ సమయంలో దారుణమైన విషయాలు మాట్లాడుకున్నామని అంది. సో, ఇద్దరు ఆడవాళ్లు కలిస్తే ఇలాగ  ఉంటుంది అన్న మాట.