గురువారం, 11 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 డిశెంబరు 2025 (15:22 IST)

పంట చేనుకు చీడపడితే ఏ మందు కొట్టాలో బాగా తెలుసు : సీఎం రేవంత్ రెడ్డి

revanth reddy
పంట చేనుకు చీడపడితే ఏ మందు కొట్టాలో తనకు బాగా తెలుసని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం హైదరాబాద నగరంలోని విద్యా నిలయం ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన కీలక ప్రసంగం చేశారు. 
 
విద్యాయాల్లో కుల వివక్ష ఉండరాదన్నారు. అందుకే యంగ్ ఇండియా స్కూల్‌లో అందరూ కలిసి చదువుకునేలా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. డబ్బు ఉన్నవాళఅలు ఎక్కడికి వెళ్ళినా చదువుకోగలరని, కానీ, పేద పిల్లలు ఎక్కడకు వెళ్ళగరని ప్రశ్నించారు. అందుకే ఉస్మానియా వర్శిటీలో నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ వర్శిటీకి రూ.1000 కోట్ల నిధులు మంజూరు చేశామని, ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
 
పైగా, ఈ నిధులు డబ్బులుగా చూడొద్దని భవిష్యత్ తరాలకు పెట్టుబడిగా చూడాలని కోరారు. ఉత్తుత్తి మాటలు చెప్పను.. మన చేనుకి చీడ పడితే ఏ మందు కొట్టాలో నాకు తెలుసు. నాకు ఇంగ్లీష్‌ రాదని వాళ్లు అనుకుంటున్నారు. చైనాకు కూడా ఆ భాష రాదు.. కానీ ఆ దేశం ప్రొడక్షన్‌ నిలిపివేస్తే చైనా కూడా విలవిలలాడుతుందన్నారు.
 
అందుకే భాష కేవలం కమ్యూనికేషన్‌ కోసం మాత్రమే.. అది నాలెడ్జ్‌ కాదు. రాష్ట్రానికి ఓయూ గుండెకాయ లాంటిది. సమస్యల మీద కొట్లాడతానంటే నేను వద్దు అనను. రాజకీయ పార్టీల మోచేతినీళ్లు తాగాలని.. వాళ్ల జెండాలు మోయాలని అనుకోవద్దు. మీ స్వతంత్రతను నిలబెట్టుకోండి అని విద్యార్థులకు ఆయన పిలుపునిచ్చారు.  
 
అలాగే, ఉస్మానియా వర్శిటికీ వెళ్ళేందుకు ఎందుకు ధైర్యం చేస్తున్నారంటూ పలువురు తనతో అన్నారన్నారు. కానీ, తనది ధైర్యం కాదని, అభిమానమన్నారు. గుండెల నిండా అభిమానం నింపుకుని ఓయూకు వచ్చానని తెలిపారు. ఈ వర్శిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలన్న సంకల్పంతో వచ్చానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.