వివాహితతో ఏకాంతంగా వ్యక్తి, ఇద్దర్నీ చెట్టుకు కట్టేసి చితక బాదారు
వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వివాహితను, ఆమె ప్రియుడిని చెట్టుకు కట్టేసి దారుణంగా దాడి చేసిన ఘటన బీహారులోని సుపాల్ గ్రామంలో వెలుగుచూసింది. మౌళ్వీ అనే వ్యక్తి సుపాల్ గ్రామానికి చెందిన ఓ వివాహితతో సన్నిహితంగా వుంటూ వస్తున్నాడు. ఈ బంధం వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది.
తరచూ సదరు వివాహిత వద్దకు వస్తూ ఆమెతో ఏకాంతంగా సమయం గడపడాన్ని గమనించిన గ్రామస్తులు వారిద్దరూ ఒకటిగా వున్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరికీ గ్రామస్తుల సమక్షంలో పంచాయతీ విధించడమే కాకుండా చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు వ్యక్తులపై దాడి చేసిన నిందితుల కోసం గాలిస్తున్నారు.