భర్త కుటుంబం వేధింపులు.. కట్టుకున్న వాడితో గొడవలు.. కన్నబిడ్డలతో వివాహిత ఆత్మహత్య
భార్యాభర్తల మధ్య గొడవలు, వేధింపులు ఆ వివాహిత ప్రాణాలను బలిగొంది. ఇంకా తన కన్నబిడ్డలను కూడా తనతోటే తీసుకుపోయింది ఆ మహిళ. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. నగరంలోని లలితానగర్‌కు చెందిన ఉదయ్‌కిరణ్‌కు, ఎన్జీవో కాలనీకి చెందిన మల్లిక (27)కు ఏడేళ్ల కిందట వివాహమైంది. వీరికి కుమారుడు ఇషాంత్‌సాయి(5), కుమార్తె పరిణిత (7 నెలలు) సంతానం.
ఈ దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతూ వచ్చాయి. ఇంకా మల్లికను ఇషాంత్ కుటుంబం వేధించడం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో రాత్రి భార్యాభర్తల మద్య ఘర్షణ జరిగింది.
మల్లికపై ఆమె భర్త దాడి చేశాడు. మల్లిక అన్న కార్తిక్ ఇంటికి చేరుకుని అందరికీ సర్దిచెప్పి వెళ్లిపోయారు. అయితే మల్లిక తీవ్ర మనస్తాపం చెందింది. దీంతో కన్నబిడ్డలతో సహా ఆత్మహత్యకు పాల్పడింది.
మల్లిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ఈ ఘటన అనంతరం ఉదయ్‌కిరణ్, ఆయన కుటుంబసభ్యులు పరారీలో ఉన్నారు.