శుక్రవారం, 14 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 నవంబరు 2022 (10:00 IST)

విశాఖపట్నంలో మోదీ పర్యటన.. సర్వం సిద్ధం.. మద్దిలపాలెంలో భారీ సభ

Modi
Modi
విశాఖపట్నంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ఇందుకోసం విశాఖకు చేరుకున్న ప్రధాన మంత్రి మోదీని గవర్నర్ హరిచందన్, సీఎం జగన్ కలిశారు. ఆపై ఉదయం పది గంటలకు పైగా వీరు ముగ్గురూ హెలికాప్టర్‌లో మద్దిలపాలెం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సభాస్థలికి చేరుకుంటారు. 
 
ఏపీలో పది కోట్ల రూపాయలకు పైగా పలు ప్రాజెక్టుల శంకుస్థాపన కోసం ప్రధాని ఈ పర్యటన చేపట్టారు. ఇంకా పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు.  
 
మరోవైపు మోదీ మద్దిలపాలెం జంక్షన్ సభను బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి దాదాపు 3 లక్షల మందిని తరలిస్తున్నారు. వీరి తరలింపు కోసం రవాణా సౌకర్యాలను భారీగా ఏర్పాటు చేశారు. అలాగే 8వేలకు పైగా పోలీసులతో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు.