1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 2 జనవరి 2023 (09:42 IST)

అమిగోస్ లో డోప‌ల్ గ్యాంగ‌ర్ గా కళ్యాణ్ రామ్

Kalyan Ram
Kalyan Ram
నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌ బింబిసార‌ తర్వాత మ‌రో డిఫ‌రెంట్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్య‌మైన చిత్రాలు, విలక్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో మెప్పించ‌టానికి క‌ళ్యాణ్ రామ్ ఆస‌క్తి చూపిస్తుంటారు. త‌న‌దైన పంథాలో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘అమిగోస్’. డైరెక్ట‌ర్ రాజేంద్ రెడ్డితో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ రూపొందుతోన్నఈ చిత్రం టైటిల్ వినగానే అందరినీ ఆకట్టుకుంది. అమిగోస్ అంటే ఫ్రెండ్‌ను పిలిచే స్పానిష్ ప‌దం. రాజేంద‌ర్ రెడ్డి ఈ చిత్రంతో దర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. 
 
ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుద‌లైన క‌ళ్యాణ్ రామ్ పోస్ట‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. కాగా.. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా అమిగోస్ మూవీ నుంచి నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ లుక్ మ‌రో పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇందులో ఆయ‌న మీసాలు తిప్పుకుని స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు. త‌న పాత్ర పేరు సిద్ధార్థ్ అని పోస్ట‌ర్‌లో తెలుస్తుంది. దానిపై మ‌నిషిని పోలిన మ‌నిషి అని అర్థం వ‌చ్చేలా డోప‌ల్ గ్యాంగ‌ర్ అని రాశారు. దానికి వెనుక అస‌లు విష‌యం తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందేంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. 
 
క‌ళ్యాణ్ స‌ర‌స‌న ఆషికా రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.  ‘అమిగోస్’ నిర్మాణం ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. దీంతో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌తోనూ టీమ్ బిజీగా ఉంది. ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 10, 2023న గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు.  
ఎన్నో సెన్సేష‌న‌ల్ మూవీస్‌ను అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న‌ ఈ సినిమాలో క‌ళ్యాణ్ రామ్‌కు జోడీగా ఆషికా రంగ‌నాథ్ న‌టిస్తుంది. జిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌.సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా.. త‌మ్మిరాజు ఎడిట‌ర్‌గా వర్క్ చేస్తున్నారు.
 
న‌టీన‌టులు: నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, ఆషికా రంగ‌నాథ్ త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం: నిర్మాణ సంస్థ‌:  మైత్రీ మూవీ మేకర్స్‌,  నిర్మాత‌లు:  న‌వీన్ ఎర్నేని, వై.ర‌వి శంక‌ర్‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  రాజేంద్ర రెడ్డి, సంగీతం:  జిబ్రాన్‌, సినిమాటోగ్ర‌ఫీ:  సౌంద‌ర్ రాజ‌న్‌.ఎస్‌, ఎడిట‌ర్‌:  త‌మ్మిరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  హ‌రి తుమ్మ‌ల‌, కొరియోగ్రాఫ‌ర్‌:  శోభి, ఫైట్ మాస్ట‌ర్స్:  వెంక‌ట్, రామ్ కిష‌న్‌, పాట‌లు:  స్వ‌ర్గీయ శ్రీ వేటూరి, రామ‌జోగ‌య్య శాస్త్రి, రెహ‌మాన్‌, సి.ఇ.ఓ:  చెర్రీ