ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 8 నవంబరు 2022 (10:10 IST)

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ చిత్రానికి అమిగోస్ ఖరారు

Nandamuri Kalyan Ram
Nandamuri Kalyan Ram
నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. రీసెంట్‌గా ‘బింబిసార’ చిత్రంతో సూప‌ర్ డూప‌ర్ హిట్ సాధించారు. ఈ భారీ విజ‌యం త‌ర్వాత నంద‌మూరి క‌థానాయ‌కుడు క‌ళ్యాణ్ రామ్ డెబ్యూ డైరెక్ట‌ర్ రాజేందర్ రెడ్డితో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న  NKR 19 చిత్రానికి మేక‌ర్స్ ‘అమిగోస్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. విభిన్నమైన పాత్ర‌లు, సినిమాలు చేసే హీరో క‌ళ్యాణ్ రామ్ న‌టిస్తోన్న ఈ సినిమా టైటిల్ కూడా డిఫ‌రెంట్‌గా ఉండ‌టంతో అంద‌రిలో ఓ క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది.
 
‘అమిగోస్’ నిర్మాణం ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. అమిగోస్ అనేది స్పానిష్ ప‌దం. ఓ స్నేహితుడిని సూచించ‌డానికి లేదా రెఫ‌ర్ చేయ‌డానికి ఈ ప‌దాన్ని ఉప‌యోగిస్తుంటారు. ఈ టైటిల్ అనౌన్స్ చేయ‌టంతో పాటు స్టైలిష్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ సినిమా కాన్సెప్ట్ ఏంట‌నే విష‌యాన్ని సూచిస్తుంది. క‌ళ్యాణ్ రామ్ పాత్ర మూడు షేడ్స్‌లో ఉంటుంద‌నే విష‌యాన్ని ఈ పోస్ట‌ర్ ఎలివేట్ చేస్తుంది.
 
‘దె సే వెన్‌ యు మీట్‌ సమ్‌బడీ దట్‌ లుక్స్ జస్ట్ లైక్‌ యు, యు డై’  ( నీలాగే కనపడే ఇంకో వ్యక్తి నీకు ఎదురుపడితే నువ్వు చస్తావు అని చెప్తారు)అనేది పోస్ట‌ర్‌పై క్యాప్ష‌న్‌గా క‌నిపిస్తుంది. ఈ పోస్ట‌ర్‌తో సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను మేక‌ర్స్ మ‌రింత‌గా పెంచేశారు. ఈ మూవీని ఫిబ్ర‌వ‌రి 10, 2023న గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. ఫైన‌ల్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేయ‌టంతో చిత్ర యూనిట్ బిజీగా ఉంది.
 
ఎన్నో సెన్సేష‌న‌ల్ మూవీస్‌ను అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస‌తోన్న ఈ సినిమాలో క‌ళ్యాణ్ రామ్‌కు జోడీగా ఆషికా రంగ‌నాథ్ న‌టిస్తుంది. గిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌.సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా.. త‌మ్మిరాజు ఎడిట‌ర్‌గా వర్క్ చేస్తున్నారు