1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 29 జనవరి 2023 (11:01 IST)

కుటుంబ సమేతంగా బెంగుళూరుకు చేరుకున్న కళ్యాణ్ రామ్ - ఎన్టీఆర్

tarakaratna
చిత్తూరు జిల్లా కుప్పంలో 'యువగళం' పాదయాత్ర సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన సినీనటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో ఆయన్ను పరామర్శించేందుకు సినీనటులు ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ బెంగళూరు వెళ్లారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో వారు బయల్దేరారు. 
 
తారకరత్న మయోకార్డియల్‌ ఇన్‌ఫార్క్‌షన్‌ కారణంగా తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారని.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని శనివారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో వైద్యులు వెల్లడించారు. నారాయణ హృదయాల వైద్యులు ఆయనకు అత్యున్నత వైద్యసేవలు అందిస్తున్నారు.
 
అంతకుముందు తమ్ముడి ఆరోగ్యంపై కళ్యాణఅ రామ్ ఓ ట్వీట్ చేస్తూ.. తన తమ్ముుడు తారకరత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. కాగా, తారకరత్నకు పది మంది వైద్యుల బృందం ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికపుడు పర్యవేక్షిస్తుంది.
 
అలాగే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, తారకరత్న ఐసీయూ లో అబ్జర్వేషన్‍‌లో ఉంచారని చెప్పారు. వైద్యులతో తాను మాట్లాడానని, తారకరత్న త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. 
 
కాగా, రక్తప్రసరణలో ఇంకా గ్యాప్‌లు వస్తున్నాయని, తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నారాయణ హృదయాలయ వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. వైద్యులు ఏ చికిత్స చేయాలో నిర్ణయించి ముందుకు పోతున్నారు.