ఆదివారం, 14 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (15:02 IST)

కోటంరెడ్డి టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధం... అందుకే ఆరోపణలు : సజ్జల రామకృష్ణారెడ్డి

kotamreddy sridhar reddy
నెల్లూరు రూరల్ వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అధికార వైకాపా నేతలను ఉలికిపాటుకు గురిచేసింది. అధికార పార్డీకే చెందిన ఎమ్మెల్యే ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగారు. 
 
తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు కోటంరెడ్డి సిద్ధమైన తర్వాతే ఆయన ఆవిధంగా మాట్లాడుతున్నారని అన్నారు. అయినా ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. కొంతమందిని ఎలా లాక్కోవాలో చంద్రబాబుకు బాగా తెలుసని సజ్జల వ్యాఖ్యానించారు. 
 
"ఇకపోతే కోటంరెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది. ఆయనే తన ఉద్దేశ్యాలను వెల్లడించిన తర్వాత ఏం చర్యలు తీసుకోగలం. సీఎం జగన్ ప్రజలను నమ్ముకుని పాలన చేస్తున్నారేగానీ ఫోన్ ట్యాపింగ్‌లను నమ్ముకుని కాదన్నారు. ఎవరు ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చు. పదవి రాలేదన్న అసంతృప్తి ఉండటం వేరు. బహిరంగంగా ఇలాంటి ఆరోపణలు చేయడం వేరు అని ఆయన అన్నారు.