1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
  4. Sania Mirza: Twitter reacts as tennis ace says goodbye to Grand Slams

గ్రాండ్‌స్లామ్ కెరీర్‌ చివరి మ్యాచ్‌లో సానియా మీర్జాకు నిరాశ

sania mirza
హైదరాబాద్ క్రీడాకారిణి, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన గ్రాండ్‌స్లామ్ కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడగా, అందులో నిరాశఎదురైంది. మెల్‌బోర్న్ వేదికగా ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ టెన్నిస్ టోర్నీ జరుగుతోంది. ఇందులో భాగంగా తాజాగా మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో సానియా మీర్జా - రోహాన్ బోపన్న జోడీ ఓటమి పాలైంది. 
 
ఫైనల్ మ్యాచ్‌లో 6-7, 2-6 తేడాతో బ్రెజిల్ జంట్ స్టెఫాని - రఫెల్‌లో చేతి ఓడిపోయింది. దీంతో ఓటమితో టెన్నిస్ కెరీర్‌కు సానియా వీడ్కోలు పలికినట్టయింది. 2009లో మహేష్ భూపతితో కలిసి సానియా తన తొలి గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత మరో ఐదు డబుల్స్‌లో గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీలు సొంతం చేసుకుంది. 
తర్వాతి కథనం
ఓ ఇంటివాడైన అక్షర్ పటేల్.. మేహా పటేల్‌తో డుం డుం డుం