శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 జనవరి 2023 (13:53 IST)

సానియా మీర్జా భర్తతో విడాకులు తీసుకోవడం ఖాయమా? ఏం చెప్పిందంటే?

sania couple
విడాకుల గురించి పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్- టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఏమాత్రం స్పందించలేదు. ఇప్పటికే వీరి వైవాహిక బంధం బీటలు వారినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ విడాకులతో విడిపోనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఇలాంటి పరిస్థితుల్లో ఈ వార్తలను నిజం చేసేలా సానియా మీర్జా ఇన్‌స్టా స్టోరీస్‌లో ఆలోచనాత్మక పోస్టు చేసింది. తమ సరిహద్దులు ఇతరులు నిర్ణయించేవి కావని చెప్పింది. 
 
వారు ఎంతో సులభంగా మా అవసరాలను నిర్ణయించేస్తున్నారు. తాను ఒకరితో దూరంతో పెంచుకున్నానని..  అది వారి తప్పు కాదని ..  కొన్ని సందర్భాల్లో వారి ప్రవర్తన తనకు సరిగ్గా అనిపించుకోవచ్చు అని సానియా మీర్జా చెప్పింది. 
 
అంటే తన భర్త షోయబ్‌తో తనకు అంతరం ఏర్పడినట్టు ఆమె పరోక్షంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి త్వరలో వీరు విడాకులు తీసుకోబోతున్న వార్తలు ఖాయమని తెలుస్తోంది.