ఆదివారం, 15 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 డిశెంబరు 2022 (11:05 IST)

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా తొలి ముస్లిం బాలిక

sania
sania
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సానియా మీర్జా మొదటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా ఎంపికైంది. భారత వైమానిక దళంలో ఫైటర్ పైలెట్‌గా ఆమె ఎంపికైంది. ఈమె మీర్జాపూర్‌కు చెందిన టీవీ మెకానిక్ కుమార్తె. 
 
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా ఎంపికైన వారిలో తొలి ముస్లిం బాలిక కూడా ఈమే. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా ఈమె ఈ స్థానాన్ని సొంతం చేసుకుంది. హిందీ మీడియం విద్యార్థి అయిన సానియా మీర్జా డిసెంబర్ 27న పూణేలోని ఎన్డీయే ఖడక్వాస్లాలో చేరనున్నారు. 
 
ఈ సందర్భంగా సానియా మీర్జా తండ్రి షాహిద్ అలీ మాట్లాడుతూ.. దేశానికి తొలి ఫైటర్ పైలట్ అవనీ చతుర్వేదిని సానియా రోల్ మోడల్‌గా భావిస్తుందని చెప్పారు.