శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2022 (08:57 IST)

ఈ దేశానికి ఇద్దరు జాతిపితలు .. అమృత ఫడ్నేకర్

amrutha
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిస్ భార్య, బీజేపీ మహిళా నేత అమృత ఫడ్నవిస్ మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. ఈ దేశానికి ఇద్దరు జాతిపితలన్నారు. వారిలో ఒకరు మహాత్మా గాంధీ కాగా, మరొకరు ప్రధాని నరేంద్ర మోడీ అంటూ కీర్తించారు. ఈమె గతంలో కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రధాని మోడీ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనను ఆమె జాతిపితగా అభివర్ణించి వివాదంలో చిక్కుకున్నారు. ఇపుడు అలాంటి వ్యాఖ్యలు చేశారు. గాంధీ దేశానికి, ఆధునిక భారత్‌కు మోడీ జాతిపితలంటూ తాజాగా వ్యాఖ్యానించారు. 
 
ఇటీవల ఓ మాక్ కోర్టు ఇంటర్వ్యూకు ఆమె హాజరయ్యారు. మోదీ జాతిపిత అయితే, మరి గాంధీ ఎవరు?అని నిర్వాహకులు ప్రశ్నించారు. దీనికి స్పందించిన అమృత ఫడ్నేకర్.. గాంధీ దేశానిక జాతిపిత అయితే, ఆధునిక భారత్‌కు ప్రధాని నరేంద్ర మోడీ జాతిపిత అంటూ వ్యాఖ్యానించారు. మొత్తంగా భారత్‌కు ఇద్దరు జాతిపితలంటూ ఆమె తనను తాను సమర్థించుకున్నారు.