గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2022 (14:56 IST)

నకిలీ, స్పామ్ ఖాతాదారులకు షాకిచ్చిన వాట్సాప్

whatsapp
నకిలీ, స్పామ్ ఖాతాదారులకు వాట్సాప్ తేరుకోలేని షాకిచ్చింది. మెటాకు చెందిన ఇన్‌స్టంట్ మెజేసింగ్ ప్లాట్‌పాం వాట్సాప్‌ ఒక్క నవంబరు నెలలోనే ఏకంగా 37.16 లక్షల నకిలీ, స్పామ్ ఖాతాలను తొలగించింది.

గత అక్టోబరు నెలతో పోల్చితే ఇది 60 శాతం అధికం కావడం గమనార్హం. అక్టోబరు నెలలో 23 లక్షల భారతీయుల వాట్సాప్ ఖాతాలను తొలగించగా, నవంబరులో ఈ సంఖ్య 37 లక్షలుగా ఉంది. గత అక్టోబరు నెలలో ముందు జాగ్రత్తగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే 8.11 లక్షల అకౌంట్లను వాట్సాప్ యాజమాన్యం తొలగించిన విషయం తెల్సిందే. నవంబరు నెలలో ఈ సంఖ్య 9.9 లక్షలకు చేరింది. 
 
దీనిపై వాట్సాప్ ఒక ప్రకటన విడుదల చేసింది."2022, నవంబరు ఒకటి నుంచి 2022 నవంబరు 30 మధ్య 37,16,000 వాట్సాప్ ఖాతాలను నిషేధించాం. ఇందులో 9,90,000 ఖాతాలను ముందు జాగ్రత్తగా తొలగించడం జరిగింది. అంటే యూజర్లు ఎలాంటి రిపోర్ట్స్ అందకముందే బ్యాన్ చేశాం" అని వాట్సాప్ పేర్కొంది. ఈ మేరకు సమాచారం, సాంకేతికత చట్టం 20211 కింద నెలవారీ నివేదికలో భాగంగా, నవంబరుకు సంబంధించి రిపోర్టును వాట్సాప్ బుధవారం వెల్లడించింది.