శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 జనవరి 2023 (11:59 IST)

విజయ్-సంగీత దంపతులు విడిపోయారా? విడాకులు తీసుకున్నారా?

Vijay_Sangeetha
Vijay_Sangeetha
తమిళ స్టార్ విజయ్-సంగీత దంపతులు విడాకులు తీసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. విజయ్ భార్య సంగీత రాబోయే మోస్ట్ అవైటెడ్ మూవీ వారిసు ఆడియో లాంచ్‌కు రాకపోవడంతో వీరిద్దరూ విడిపోతున్నారని టాక్ వస్తోంది. 
 
వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలను విజయ్-సంగీత ఎదుర్కొంటున్నారని ఊహాగానాలు వస్తున్నాయి. అలాగే అట్లీ భార్య ప్రియా అట్లీ బేబీ షవర్‌కి హాజరైనప్పుడు తలపతి విజయ్ అతని భార్య సంగీతతో కలిసి రాలేదు. విజయ్‌తో ఎప్పుడూ వెన్నంటి వుండే సంగీత ప్రస్తుతం కొన్ని ప్రోగ్రామ్‌లకు హాజరు కాకపోవడంపై విడాకుల వార్తలు నిజమేనా అంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. 
 
తమిళ స్టార్ విజయ్ తన స్నేహితురాలు సంగీతను 25 ఆగస్టు 1999న వివాహం చేసుకున్నారు. వారికి జాసన్ సంజయ్ అనే కుమారుడు, దివ్య సాషా అనే కుమార్తె ఉన్నారు. జాసన్ తన తండ్రితో కలిసి ఒక చిత్రానికి దర్శకత్వం వహించాలనుకుంటున్నాడు. 
 
అలాగే విజయ్ నటించిన తెరిలో దివ్య అతని కుమార్తెగా కనిపించింది. తాజాగా సంగీత విజయ్‌కి దూరమైందని.. విడాకులు తీసుకుందని.. ఆమె లండన్‌లో తన తల్లిదండ్రులతో నివసిస్తుందని టాక్ వస్తోంది. అందుకే దర్శకుడు అట్లీ భార్య ప్రియా బేబీ షవర్‌కి విజయ్ ఒంటరిగా వచ్చాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.