చాపర్‌లో ఒంగోలుకు వచ్చిన బాలకృష్ణ, శ్రుతిహాసన్
Balakrishna, Shruti Haasan
ఈరోజు ఒంగోలులో జరుగుతున్న వీరసింహారెడ్డి ప్రీరిలీజ్‌కు నందమూరి బాలకృష్ణ, హీరోయిన్ శ్రుతి హాసన్ హైదరాబాద్ నుంచి చాపర్‌లో వచ్చారు. వారిని నిర్మాత నవీన్ స్వాగతం పలికారు. వారి రాకతో ఒంగోలులో మైదానం సమీపంలోని విడిదికి రాగానే అభిమానులు కేరింతలు కొట్టారు. వారిని దూరంగా పరిశీలిస్తూ బాలకృష్ణ చేతులు ఊపుతూ విషెస్ చెప్పారు. ఈ కార్యక్రమానికి ఒంగోలుకు చెందిన కొద్దిమంది నాయకులు కూడా రానున్నారని తెలిసింది. పోలీసు అధికారుల కూడా హాజరు కానున్నారు. ఈరోజు రాత్రి 8గంటల తర్వాత కార్యక్రమం జరగనుంది.
నటసింహం నందమూరిబాలకృష్ణ, శ్రుతిహాసన్, నవీన్ యెర్నేని టీమ్ వీరసింహారెడ్డితో కలిసి భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం హైదరాబాద్ నుండి ఒంగోలు వద్ద చాపర్‌లో వచ్చారు. ఇప్పటికే అక్కడ మైకుల్లో ఫాన్స్ కు పోలీసులు తగు సూచనలు చేస్తున్నారు.