శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 జనవరి 2023 (19:44 IST)

ఆస్ట్రేలియన్ ఓపెన్- మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్ లోకి సానియా జోడీ

sania mirza
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో భారత ఏస్ సానియా మీర్జా, రోహన్ బోపన్న జోడీ మంగళవారం సెమీఫైనల్లో మూడో సీడ్ అమెరికన్-బ్రిటీష్ జోడీ డెసిరే క్రావ్‌జిక్-నీల్ స్కుప్‌స్కీని ఓడించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. 
 
సానియా-బోపన్న జంట 7-6(5), 6-7(5),10-6 తేడాతో రెండుసార్లు వింబుల్డన్ ఛాంపియన్‌గా నిలిచిన దేశీరే-స్కుప్‌స్కీపై అలవోక విజయం సాధించింది.
 
ఆస్ట్రేలియాకు చెందిన ఒలివియా గడెకి, మార్క్ పోల్‌మన్స్‌తో పాటు బ్రెజిల్‌కు చెందిన లూయిసా స్టెఫానీ, రాఫెల్ మాటోస్‌ల మధ్య జరిగే మ్యాచ్‌లో విజేతతో భారత ద్వయం తలపడనుంది.