శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్

ఆస్ట్రేలియన్ ఓపెన్ : రెండో రౌండ్‌లోనే రఫెల్ నాదల్‌కు షాక్

rafel nadal
మెల్‌బోర్న్ వేదికగా ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీ రెండో రౌండ్‌లోనే టెన్నిస్ దిగ్గజం రఫేల్ నాదల్‌కు తేరుకోలేని షాక్ తగిలింది. ఫలితంగా ఆయన ఈ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మెకంజీ మెక్‌డోనాల్డ్ చేతిలో 4-6, 4-6, 5-7 స్కోరుతో రఫెల్ నాదల్ ఓడిపోయాడు.
 
పైగా, ఎడమకాలికి తగిలిన గాయం వల్ల రఫెల్ నాదల్ సరైన ఆటను ఆడలేక పోయాడు. కాలికి తీవ్ర సమస్య తలెత్తడంతో తీవ్ర ఇబ్బందిపడ్డాడు. అయితే, మెక్‌డోనాల్డ్ తొలి రెండు సెట్లు సునాయాసంగా గెలుచుకున్నాడు. మూడో రౌండ్‌లో నాదల్ గాయపడటంతో తిరిగి ఆటపై పట్టుసాధించలేక ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.