గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 జూన్ 2022 (07:55 IST)

రాఫెల్‌ నాదల్‌కు తీరని దాహం - 14వ సారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్

Rafael Nadal
స్పెయిన్ వీరుడు రఫెల్ నాదల్‌కు అంతర్జాతీయ టెన్నిస్ టైటిళ్లను గెలుచుకోవాలన్న తపన ఇంకా తగ్గలేదు. ఈ దాహమే ఆయన్ను ప్రతి టోర్నీలోనూ విజేతగా నిలపుతుంది. తాజాగా ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ టైటిల్ విజేతగా నిలిచారు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కాస్పర్ రూడ్‌పై ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ఆయన 14వ సారి ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ విజేతగా నిలిచారు. 
 
నిజానికి రఫేల్‌కు క్లే కోర్టుల్లో ఎవరూ ఎదురునిలవలేని పరిస్థితి వుంది. ఇపుడు మరోమారు అది నిరూపితమైంది. రోలాండ్ గారోస్ స్టేడియంలో ఏకపక్షంగా సాగితన ఫైనల్ మ్యాచ్‌లో 6-3, 6-3, 6-0 తేడాతో ప్రత్యర్థి నార్వే ఆటగాడు కాస్పర్ రూడ్‌ను మట్టి కరిపించాడు. ఫలితంగా టోర్నీ టైటిల్ విజేతగా నిలించారు. 
 
మొత్తంగా చూస్తే రాఫెల్ నాదల్‌కు ఇది 22వ గ్రాండ్‌శ్లామ్ టోర్నీ. ప్రపంచ టెన్నిస్ చరిత్రలో ఇన్ని గ్రాండ్‌‍శ్లామ్ టైటిళ్లను నెగ్గిన ఆటగాడుగా రాఫెల్ చరిత్ర సృష్టించాడు. ఈయనకు సమకాలీకులుగా ఉన్న రోజర్  ఫెదరర్, నొవాక్ జకోవిచ్ చెరో 20 గ్రాండ్ శ్లామ్ టైటిళ్ళతో రెండో స్థానంలో నిలిచాడు.