మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం.. పలువురు అమ్మాయిల అరెస్టు
హైదరాబాద్ నగరంలోని ఎస్.ఆర్.నగర్‌లో మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న దందాను స్థానిక పోలీసులు బహిర్గతం చేశారు. ఆ బ్యూటీ స్పా సెంటరుపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి ఇద్దరు యువతులు ఒక నిర్వాహకుడుని, ఒక విటుడుని కూడా పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన విటుడు ఓ శాటిలైట్ చానెల్‌కు విలేకరిగా వ్యవహరిస్తున్నట్టు పోలీసులు విచారణలో గుర్తించారు.
గతంలో కొన్ని స్పా సెంటర్స్‌కి వెళ్లి వీడియోలు తీసి బ్లాక్‌మెయిన్ చేసి ఆయా మసాజ్ సెంటర్ల యజమానుల నుంచి లక్షలాది రూపాయలను వసూలు చేసినట్టు సమాచారం. ఇపుడు వచ్చిన పక్కా సమాచారం మేరకు పోలీసులు మసాజ్ సెంటరుపై దాడి చేసి ఆ రిపోర్టుతోపాటు యువతులను కూడా అరెస్టు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడు కోసం గాలిస్తున్నారు.