1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 సెప్టెంబరు 2022 (13:31 IST)

నాదల్‌ను హత్తుకుని కన్నీటి పర్యంతం అయిన ఫెదరర్

Nadal
Nadal
టెన్నిస్‌ దిగ్గజం, స్విస్‌ మాస్టర్‌ రోజ‌ర్ ఫెద‌ర‌ర్ కన్నీటి పర్యంతం అయ్యాడు. స్పెయిన్‌ బుల్‌ రఫేల్‌ నాదల్‌తో కలిసి లావెర్ క‌ప్‌ 2022లో డ‌బుల్స్ మ్యాచ్‌ ఆడిన ఫెద‌ర‌ర్ ఓటమిపాలయ్యారు. 
 
ఆపై మ్యాచ్ ముగిసిన త‌ర్వాత రోజ‌ర్ కంటిత‌డి పెట్టారు. ఫెదరర్‌ కన్నీళ్లు చూసి నాదల్‌ కూడా భావోద్వేగానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
 
లావెర్ క‌ప్‌ 2022తో రోజ‌ర్ ఫెదరర్‌ ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ కెరీర్‌ ముగిసింది. దీంతో మ్యాచ్‌ అనంతరం తీవ్ర ఉద్వేగానికి గురయ్యాడు. తన ప్రియ సహచరుడైన నాదల్‌తో పాటు తోటి ఆటగాళ్లను హత్తుకుని కంటిత‌డి పెట్టారు. ఫెదరర్‌ను చూసి తట్టుకోలేక నాదల్‌ కూడా ఏడ్చేశాడు. 
 
అంతేకాదు ప్రేక్షకులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఆపై నిత్యం తనకు అండగా నిలిచిన భార్య మిర్కాను హత్తుకుని ఫెదరర్‌ భావోద్వేగానికి గురయ్యారు. ఈ జ‌ర్నీ అద్భుతంగా సాగింద‌ని, సంతోషంగా ఉన్నాన‌ని ఫెద‌ర‌ర్ అన్నారు. 
Nadal
Nadal
 
రోజ‌ర్ ఫెదరర్‌, రఫెల్ నాదల్‌ ఏడుస్తున్న ఫోటోలను ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నిర్వాహకులు తమ ట్విటర్ వేదికగా షేర్‌ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.