శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 ఆగస్టు 2022 (17:21 IST)

ప్రధాని వీడ్కోలు ప్రసంగం.. భావోద్వేగానికి గురైన వెంకయ్య నాయుడు

venkaiah naidu
ఆగస్టు 10వ తేదీతో రాజ్యసభ ఛైర్మన్‌గా వెంకయ్యనాయుడు ఐదేళ్ల పదవీకాలం ముగియనుంది. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడుకు వీడ్కోలు పలికిన ప్రధాని నరేంద్ర మోదీ, “మీరు రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారని, ప్రజా జీవితంతో అలసిపోలేదని ఎప్పటినుంచో చెబుతుంటారు.. మీ పదవి కాలం ముగిసిపోవచ్చు, కానీ రాబోయే సంవత్సరాల్లో మీ అనుభవాల నుండి దేశం ప్రయోజనం పొందుతూనే ఉంటుంది" అంటూ కొనియాడారు. 
 
వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా మరియు రాజ్యసభ ఛైర్మన్‌గా ఐదేళ్లపాటు కొనసాగారని, ఆ సమయంలో సభ ఉత్పాదకత 70% పెరిగిందని, ఆయన తెలివితేటలను కొనియాడారు ప్రధాని. వీడ్కోలు సందర్భంగా వెంకయ్య భావోద్వేగానికి గురయ్యారు. ప్రధానమంత్రి మోదీ ఉద్వేగభరితమైన ప్రసంగానికి ఉపరాష్ట్రపతి చలించిపోయి కళ్లు చెమ్మగిల్లినట్లు కనిపించారు.