మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 సెప్టెంబరు 2022 (23:05 IST)

టెన్నిస్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన రోజర్ ఫెదరర్

Federer
Federer
టెన్నిస్ దిగ్గజం, స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్ టెన్నిస్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. వచ్చేవారం లండన్‌లో జరిగే లేవర్ కప్ చివరి ఏటీపీ ఈవెంట్ అని స్పష్టం చేశాడు. 
 
తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఆట నుంచి తప్పుకునే సమయం వచ్చిందని, అందుకు కఠినమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు.  
 
కాగా, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‌గా పిలువబడే ఫెదరర్ తన కెరీర్‌లో మొత్తం 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సాధించాడు. 1500 పైగా మ్యాచులాడి 310 వారాల పాటు ప్రపంచ నెంబర్ వన్‌గా కొనసాగాడు. 
 
ఆరు సార్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్, 8 సార్లు వింబుల్డెన్, ఐదుసార్లు యూఎస్‌ ఓపెన్‌, ఒకసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ను కైవసం చేసుకున్న ఆటగాడిగా ఫెదరర్ రికార్డు సృష్టించాడు. 1998లో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ ఆటగాడిగా మారిన ఫెదరర్‌ తన సుదీర్ఘ కెరీర్‌లో 82 శాతం విజయాలు సాధించాడు.