సోమవారం, 7 అక్టోబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 ఆగస్టు 2022 (16:26 IST)

సెరెనా విలియమ్స్ కీలక ప్రకటన.. టెన్నిస్‌కు దూరం..

Serena williams
అమెరికాకు చెందిన నల్ల కలువ సెరెనా విలియమ్స్ కీలక ప్రకటన చేసింది. టెన్నిస్‌కు దూరమవుతున్నానని ప్రకటించింది. దీన్ని తాను రిటైర్మెంట్‌గా చెప్పనని, టెన్నిస్‌కు దూరంగా ఉంటూ తన బిజినెస్, రెండో సంతానం విషయాలపై దృష్టి సారిస్తానని చెప్పింది.
 
టెన్నిస్‌కు దూరంగా వెళ్తున్నానని, తన జీవితంలోని ఇతర కార్యకలాపాల వైపు పూర్తిగా మళ్లుతున్నానని తెలిపింది. వచ్చే నెలలో సెరెనా 41వ వసంతంలోకి అడుగుపెడుతోంది.  
 
ప్రస్తుతం సెరెనా టొరంటో నేషనల్ ఓపెన్‌లో ఆడుతోంది. ఆ తర్వాత ఈ నెల 29న న్యూయార్క్‌లో ప్రారంభమయ్యే యూఎస్ ఓపెన్‌లో ఆడబోతోంది. ఇదే ఆమె చివరి టోర్నీ కాబోతోంది. తన సొంత దేశం అమెరికాలో తన కెరీర్‌కు ముగింపు పలకబోతోంది.