శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 జులై 2022 (17:41 IST)

క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పిన ఇద్దరు విండీస్ క్రికెటర్లు

Lendl Simmons
ఇద్దరు వెస్టిండీస్ క్రికెటర్లు తమ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పారు. వీరిద్దరూ ఒకే రోజు ప్రకటించారు. వారిలో ఒకరు విండీస్ మాజీ సారథి దానేష్ రామ్‌దిన్ కాగా, మరొకరు స్టార్ బ్యాటర్ లెండి సిమన్స్ ఉన్నారు. 
 
గత 2019లో చివరిసారిగా టీ20 క్రికెట్ ఆడిన రామ్‌దిన్.. తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నానని, ఇకపై ప్రాంచైజీ క్రికెట్ మాత్రమేనని ఆడుతానని ప్రకటించారు. 
 
ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. "అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు సంతోషంగా ప్రకటిస్తున్నా. గడిచిన 14 యేళ్ళు నా కల నిజం చేసింది. ట్రినిడాడ్ అండ్ టొబాగోతో పాటు వెస్టిండీస్ ఆడాలన్న నా చిన్ననాటి కల నెరవేరింది. నా కెరీర్‌లో ప్రపంచాన్ని చూసే అవకాశం లభించింది. వేరు వేరు సంప్రదాయాల వాళ్ళను కలిసినా నేను పుట్టిన గడ్డపై గౌరవం మాత్రం ఏమాత్రం తగ్గలేదు" అని పేర్కొన్నారు. 
 
మరోవైపు, లెండి సిమన్స్ కూడా అంతర్జాతీయ కెరీర్‌కు స్వస్తి చెప్పాడు. సీపీఎల్‌లో ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న ట్రింబాగో నైట్ రైడర్స్‌ తమ ట్విట్టర్ ఖాతాలో ముందుగా ఈ విషయాన్ని వెల్లడించారు. సిమన్స్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాని వెల్లడించారు.