గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 1 జులై 2022 (22:54 IST)

గ్రావిటీ జెడ్‌ టీడబ్ల్యుఎస్‌ బడ్స్‌ను విడుదల చేసిన డెఫీ; సాటిలేని రీతిలో 50 గంటల బ్యాటరీ లైఫ్‌

Defy
డెఫీ (ఇమాజిన్‌ మార్కెటింగ్‌ లిమిటెడ్‌ కు సొంతమైన బ్రాండ్‌) తమ గ్రావిటీ జెడ్‌ టీడబ్ల్యుఎస్‌ బడ్స్‌ను  విడుదల చేసింది. ఇవి అత్యుత్తమంగా 50 గంటల బ్యాటరీ జీవితం కలిగి ఉంటాయి. డెఫీ గ్రావిటీ జెడ్‌, ఆడియో వేర్‌ను నూతన స్థాయికి తమ క్వాడ్‌ మైక్‌ ఈఎన్‌సీతో తీసుకువెళ్తుంది.


క్వాడ్‌ మైక్‌ ఈఎస్‌సీ వాతావరణంలో రణగొణ ధ్వనులను అడ్డుకోవడంతో పాటుగా మీ అనుభవాలను అత్యున్నత కాల్‌ నాణ్యతకు తీసుకువెళ్తాయి. మీరు ఉన్న ప్రాంతంతో సంబంధం లేకండా స్పష్టంగా ,బిగ్గరగా శబ్ద నాణ్యతను ఆస్వాదించవచ్చు. డెఫీ గ్రావిటీ జెడ్‌లో 13ఎంఎం  డైనమిక్‌ డ్రైవర్స్‌ ఉన్నాయి. ఇవి శక్తివంతమైన, ఆహ్లాదకరమైన బాస్‌ బూస్ట్‌ సౌండ్‌ నాణ్యతను అందిస్తుంది.

 
డెఫీ గ్రావిటీ జెడ్‌  కేవలం మహోన్నతమైన శబ్ద నాణ్యతను సంగీత ప్రేమికులకు అందిస్తూ 50 మిల్లీ  సెకన్‌ లో లాటెన్సీ- టర్బో మోడ్‌తో వస్తుంది. ఇది గేమర్లకు పూర్తి సంతోషాన్ని అందిస్తుంది. టర్బో మోడ్‌ వేగంగా బ్లూ టూత్‌ ల్యాగ్‌ను తగ్గించడంతో పాటుగా వేగవంతంగా ప్రో గేమింగ్‌ అనుభవాలను సైతం అందిస్తుంది. డెఫీ గ్రావిటీ జెడ్‌ మహోన్నత ఫీచర్లను కలిగి ఉంది.  ప్రతి బడ్‌పై టచ్‌ కంట్రోల్స్‌ ఉంటాయి. కేవలం 10 నిమిషాల చార్జ్‌తో  మూడు గంటల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. ఐపీఎక్స్‌ 4వాటర్‌, స్వెట్‌ రెసిస్టెన్స్‌ రేటింగ్‌  కలిగి ఉండటం వల్ల మనశ్శాంతి కూడా లభిస్తుంది.
 
డెఫీ గ్రావిటీ జెడ్‌లో అత్యుత్తమంగా శక్తి, పనితీరు అత్యంత అందుబాటు ధరలో లభిస్తుంది. ఇది ఫ్లిప్‌కార్ట్‌పై జూన్‌ 30వ తేదీ నుంచి కేవలం 999 రూపాయలకు లభిస్తుంది.