శుక్రవారం, 3 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 జులై 2022 (08:07 IST)

ఐసీసీ టీ20 ర్యాంకుల : టాప్-5లో సూర్యకుమార్

surya kumar yadav
ఐసీసీ టీ20 ర్యాంకులను ప్రకటించింది. ఇందులో భారత ఆటగాడు సూర్యకుమార్ ఐదో స్థానానికి ఎగబాకాడు. ఇటీవల ఇంగ్లండ్ జట్టుతో కలిసి భారత క్రికెట్ జట్టు టీ20 సిరీస్‌ను ఆడింది. ఇందులో సూర్యకుమార్ అదరగొట్టాడు. ఫలితంగా సూర్యకుమార్ ర్యాంకు మెరుగుపడింది. 
 
ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకుల పట్టికలో టాప్ 5లో సూర్యకుమార్ నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్ తర్వాత సూర్య కుమార్ టాప్ 10 బ్యాటర్లలో చోటు దక్కించుకున్నాడు. బాబర్‌ ఆజామ్‌ (పాకిస్థాన్‌), మహ్మద్‌ రిజ్వాన్‌ (పాకిస్థాన్‌) అయిడెన్‌ మార్‌క్రమ్‌ (దక్షిణాఫ్రికా), డేవిడ్‌ మలన్‌ (ఇంగ్లాండ్‌)లు సూర్య (732) కంటే ముందున్నారు.
 
అలాగే, వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో జస్ప్రిత్‌ బూమ్రా నాలుగు పాయింట్లు మెరుగుపరుచుకుని టాప్‌ - 1లో నిలిచాడు. అతని తర్వాత ట్రెంట్‌ బౌల్ట్‌ (న్యూజిలాండ్‌), షాహీన్‌ అఫ్రిది (పాకిస్థాన్‌) జాస్‌ హేజిల్‌వుడ్‌ (ఆస్ట్రేలియా), ముజీబ్‌ అర్‌ రెహమాన్‌ (అఫ్గానిస్థాన్‌)లు టాప్‌-5లో ఉన్నారు.