1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 జూన్ 2022 (17:00 IST)

అంతర్జాతీయ క్రికెట్‌కు బైబై చెప్పేసిన మిథాలీ రాజ్

mithali raj
టీమిండియా మహిళల జట్టు కెప్టెన్​ మిథాలీ రాజ్ సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది మిథాలీ. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా భావోద్వేగ మెసేజ్ చేసింది మిథాలీ. ఇన్నాళ్లు తన పట్ల ప్రేమ, సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసింది. 
 
ఇదే సపోర్ట్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా లభిస్తోందని ఆశిస్తున్నానని తెలిపారు. దేశం కోసం బరిలోకి దిగినప్పుడు ఎంతో గర్వపడేదానినని చెప్పారు. ఇక, అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్ ప్రకటిస్తున్నాడని అంటూ ట్విట్టర్ వేదికగా లేఖ పోస్ట్ చేసింది మిథాలీ రాజ్ తెలిపారు.  
 
మిథాలీ రాజ్.. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ఇప్పటి వరకు 232 వన్డేల్లో టీమ్ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించి, 7,805 పరుగులు రాబట్టింది. అత్యధిక స్కోరు 125 నాటౌట్ గా ఉంది. అందులో 7 సెంచరీలు, 64 అర్ధ శతకాలు ఉన్నాయి. 
 
కెరీర్‌లో 12 టెస్టులు ఆడి 699 రన్స్ సాధించింది మిథాలీ రాజ్. అందులో ఒక శతకం, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే ఈ ఫార్మాట్‌లో మిథాలీ రాజ్ నెలకొల్పిన అత్యధిక స్కోరు 214 పరుగులు. మరోవైపు పొట్టి ఫార్మాట్ (టీ20) టీమ్ఇండియా తరఫున 89 మ్యాచులు ఆడిన మిథాలీ రాజ్.. 2,364 పరుగులను సాధించింది. వాటిలో 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
 
1999 నుంచి భారత జట్టులో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తాను ఆడిన తన తొలి వన్డేలో ఐర్లాండ్‌పై 114 పరుగులు చేసి సత్తా చాటారు ఈ క్రికెటర్. 
 
22 ఏళ్లకు పైగా ప్రపంచ వన్డే క్రికెట్‌లో కొనసాగుతున్న తొలి క్రికెటర్ మిథాలీ. మిథాలీ రాజ్ 1982 డిసెంబర్ 3న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జన్మించింది.
 
భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. క్రికెట్‌లో ఎంట్రీ కాకపోయుంటే.. భరతనాట్యంలో ప్రావీణ్యురాలై ఉండేది. 2001-02లో మొదటి టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండుపై లక్నోలో ఆడింది. ఇంగ్లాండ్ పై టాంటన్‌లో జరిగిన టెస్టు మ్యాచ్ లో 214 పరుగులు సాధించి మహిళా క్రికెట్ లో ప్రపంచ రికార్డు సృష్టించింది.
 
మిథాలీ రాజ్..2005లో జరిగిన మహిళా ప్రపంచ కప్ క్రికెట్‌లో కెప్టెన్‌గా ఉంది. 2010, 2011, 2012లో వరుసగా ఐసీసీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉంది. 
 
లేటెస్ట్ గా మిథాలీ రాజ్ 13 నవంబర్ 2021న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతులమీదుగా "మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న" అవార్డును అందుకుంది.