1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Retirement age extended 60 to 62 years

రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాల నుంచి 62కి పెంపు

Retirement
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన పీఆర్సీపై తీవ్ర గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. పాత పీఆర్సీని అమలు చేయాలని ఏపీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఉద్యోగ రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. 
 
ఈ ఫైలుకు గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం లభించింది. గవర్నర్ ఆమోదముద్ర కావడంతో… దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసే అవకాశం కూడా ఉంది. దీనిపై రిటైర్ కాబోయే ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
తర్వాతి కథనం
దేశంలోనే తొలి 3డీ గృహం.. ఆనంద్ మహీంద్రా ఆసక్తి