తెలుగు నటీనటులు రాబరీకి గురవుతున్నారా!
రెండు తెలుగు రాష్ట్రాలలో నటీనటులు చాలామంది వున్నారు. కొత్త నిర్మాతలు, దర్శకులు వారిని ఎంకరేజ్ చేయాలి. కానీ ఇతర రాష్ట్రంలోని నటీనటులను పలువురు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది సినిమారంగం, టెలివిజన్ రంగం, ఇప్పుడు వెబ్ సిరీస్ కూడా ఇది పాకింది. ఆమధ్య ఓ ప్రముఖ సంస్థ నిర్మించే వెబ్ సిరీస్‌కోసం ఆర్టిస్టులను తీసుకుంటున్నట్లు ప్రకట వెలువడింది. వచ్చిన వారికి ఆడిషన్ చేపట్టారు. చాలామంది పాల్గొన్నారు. కట్‌చేస్తే, దర్శకుడుకి తెలిసినవారిని తమకు కావాల్సిన వారిని నిర్మాణ సంస్థలు ఎంపిక చేశాయి. పేరుకు ఆడిషన్ అనేది సర్వసాధారణమై పోయింది.
తాజాగా ఓటీటీ జి5తో ప్రముఖ నిర్మాత దిల్ రాజ టై అప్ అయ్యారు. ఆయన వారసురాళ్ళు కుమార్తె, తన సోదరుడు శిరీష్ కుమార్తెలు నిర్మాణరంగంలోకి ప్రవేశించారు. తొలుత వెబ్ సిరీస్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి దర్శకుడు హరీస్ శంకర్ కూడా ఓ నిర్మాత. ఇందులో అందరినీ కొత్తవారికి అవకాశాలు కల్పిస్తామని దిల్ రాజు ప్రకటించాడు. కానీ ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. జీటీవీతో పార్టనర్‌గా చేస్తే ఇక్కడి చాలామంది టాలెంట్ వున్న తెలుగువారికి అవకాశాలు ఇస్తారా! అని అడిగితే, అది తమ పరిధిలోలేదంటూ జీ టీవీ వారిని అడగండి అంటూ దాట వేశాడు.
వెంటనే హరీస్ శంకర్ మాట్లాడుతూ, రాజమౌళి సినిమా చేస్తే పాన్ ఇండియాలోని స్టార్స్‌ను తీసుకునిచేస్తారు. రామ్‌చరన్, ఎన్.టి.ఆర్.కు అవకాశం ఇవ్వలేదా అంటూ తెలివిగా సమాధానం చెప్పాడు. అంతేకాకుండా వ్యాపారపరంగా నటీనటుల్ని చూస్తామని అవసరమైతే వేరే రాష్ట్రం వారిని కూడా తీసుకుంటామని తేల్చిచెప్పారు. పైగా ఇలా నెగెటివ్ గా ఆలోచించకూడదని సలహా కూడా ఇచ్చాడు.
ఇప్పటికే తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్‌లోనూ, టీవీ నటీనటుల సంఘంలోనూ ఈ విషయమై చర్చ జరుగుతోంది. పరభాషల్లో మన నటీనటుల్ని (తెలుగువారిని) వారు ఎంకరేజ్ చేసిన దాఖలాలు లేవని మన నటీనటుల సంఘం చెబుతోంది కూడా. ఈ విషయంలో గతంలోనే కోట శ్రీనివాసరావుతో పాటు పలువురు వాపోయారు కూడా. కానీ ఫలితంలేదు. అందుకే తెలుగు భాషలో పరభాష నటీనటులతో ముందుముందు మరింత పెద్దపీట వేయనున్నట్లు స్పష్టం గాతెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే తెలుగు నటీనటులు రాబరీకి గురవుతున్నారని కొందరు విమర్శిస్తున్నారు. మరి దీనికి ఎవరు సొల్యూషన్ చూపుతారో చూడాలి.