శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 జనవరి 2022 (19:03 IST)

రష్మీ గౌతమ్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా?

బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోతో రష్మీ గౌతమ్ సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే. సోలోగా ఉన్న టాప్ యాంకర్ రష్మి గౌతమ్ రహస్యంగా పెళ్లి చేసుకుందని దాని సారాంశం. తాను పెళ్లి చేసుకున్న విషయం బయటికి వెళితే కెరీర్ పరంగా డిస్టబెన్స్ వస్తుందని.. చెప్పకుండా మూడు ముళ్ళు వేయించుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
 
నిజానికి కొన్నేళ్ల కింద రష్మి ప్రేమ వివాహం చేసుకుందని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుందంటూ ఈ యాంకర్‌పై న్యూస్ వచ్చాయి. 
 
అయితే అందులో ఎలాంటి నిజం లేదని తర్వాత తెలిసింది. ఇక జబర్దస్త్ షోకు యాంకరింగ్ చేస్తున్నప్పుడు.. అక్కడ ఉన్న సుడిగాలి సుధీర్‌తో ఈమెకు ఎఫైర్ ఉందని ప్రచారం బాగానే జరిగింది. ఇప్పటికీ వాళ్ళ మధ్య ఏదో ఉంది.. ఏదో నడుస్తుంది అంటూ ఎప్పటికప్పుడు వార్తలు వండుతూనే ఉంటారు.
 
అయితే అదంతా కేవలం ప్రోగ్రాం రేటింగ్ కోసమే చేశారని.. స్క్రిప్టులో భాగంగానే అవన్నీ ఉంటాయని అందరూ చెప్పేమాట. తాజా సమాచారం ప్రకారం రష్మీ.. ఇండస్ట్రీతో ఏమాత్రం​ సంబంధం లేని ఓ వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకుందట. 
 
అతను ఓ ప్రైవేట్‌ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం భర్తతో కలిసి హైదరాబాద్‌లోనే ఉంటుందట. అయితే ఈ విషయం గురించి బయటకు లీకైతే కెరీర్‌ పరంగా ఇబ్బందులు వస్తాయని భావించి పెళ్లి మ్యాటర్‌ను దాచేసిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
 
ఈ విషయంపై రష్మీ త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. గతంలో యాంకర్‌ రవి సైతం పెళ్లయిన విషయాన్ని దాచి పెట్టిన సంగతి తెలిసిందే. ఇక రష్మీ పెళ్లి వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఫ్యాన్స్‌ మరిప్పుడు సుధీర్‌ పరిస్థితేంటి అంటూ పోస్టులు పెడుతున్నారు.